83 Biopic : గత కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. దాంతో పాటు చరిత్రలో జరిగిన ముఖ్య సంఘటన ఆధారంగా మన దర్శక, నిర్మాతలు సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అందులో ఎక్కువ మటుకు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలుస్తున్నాయి. అదే కోవలో దాదాపు 38 ఏళ్ళ కింద అందించిన మధురమైన విజయం 1983 వరల్డ్ కప్. దాన్ని ఇతివృత్తంగా తీసుకుని బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ చేసిన సినిమా 83. (Twitter/Photo)
ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నేడు (డిసెంబర్ 24)న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కపిల్ దేవ్ సహా పలువురు క్రికెటర్స్‌తో పాటు సినీ ప్రముఖులకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ సినిమా ప్రమోషన్స్‌ను జోరుగా చేస్తున్నారు. ఈ కోవలో హైదారాబాద్‌లో ‘83’ మూవీ ప్రమోషన్స్ నిర్వహించారు. నాగార్జున ముఖ్య అదిథిగా హాజరైన ఈవెంట్‌కు ఈ వేడుకకు తొలి వరల్డ్ కప్ సారధి కపిల్ దేవ్‌తో పాటు హీరో రణ్వీర్ సింగ్‌తో పాటు సినిమా దర్శక, నిర్మాతలు హాజరయ్యారు. (Twitter/Photo)
తెలుగు గడ్డపై నిర్వహించిన ఈ మూవీ ప్రమోషన్స్‌లో భారత్ తొలి ప్రపంచ కప్ సారథి కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ముందుగా నిర్మాత విష్ణువర్ధన్ ఇందూరి తన దగ్గరకి వచ్చి 1983 భారత జట్టు తొలిసారి క్రికెట్లో ప్రపంచ కప్ విజయం నేపథ్యంలో సినిమా చేస్తే బాగుంటుందని తనతో అన్నారు. ముందు నేను ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత నిర్మాత విష్ణు తన దగ్గరికి రెండు మూడేళ్లు తిరుగుతూనే ఉన్నారు. ‘83’ గురించి మాట్లాడితే బాగుండదన్నాను. మీతో టీ తాగడానికి వచ్చానని చెప్పేవారు. అలా మెల్లగా ఈ సినిమా చేయడానికి నన్ను ఒప్పించారని కపిల్ దేవ్ ఈ సినిమా ఎలా మొదలైందనే విషయాన్ని ప్రస్తావించారు. (Twitter/Photo)