దాదాపు 38 ఏళ్ళ కింద అందించిన మధురమైన విజయం 1983 వరల్డ్ కప్. దాన్ని ఇతివృత్తంగా తీసుకుని బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ చేసిన సినిమా 83. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కపిల్ దేవ్ సహా పలువురు క్రికెటర్స్‌తో పాటు సినీ ప్రముఖులకు ముంబైలో ప్రీమియర్స్ ప్రదర్శించింది. ఈ వేడుకకు మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్‌తో పాటు హీరో రణ్వీర్ సింగ్ సినిమా దర్శక, నిర్మాతలు హాజరయ్యారు. (Twitter/Photo)
భారత దేశంలో క్రికెట్ అనేది కేవలం ఆట కాదు.. ఎమోషన్.. ఇంకా చెప్పాలంటే ఓ మతం. 130 కోట్ల మందిలో దాదాపు 70 శాతం మంది క్రికెట్ చూస్తారంటూ సర్వేలు కూడా చెప్తున్నాయి. అంటే మన దేశంలో క్రికెట్ అనేది ఎంత పెద్ద క్రీడో అర్థమవుతుంది. అందుకే క్రికెట్ అన్నా.. ఆ నేపథ్యంలో వచ్చే సినిమాలన్నా ప్రేక్షకులు చాలా ఇష్టపడుతుంటారు. భారత దిగ్గజ క్రికెటర్స్‌లో ఒకరైన మాజీ సారథి కపిల్ దేవ్ (Kapil Dev) 83 వరల్డ్ కప్‌లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)
బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ ఈ సినిమాను డైరెక్టర్ చేశారు. ఇప్పటికే టీమిండియా మాజీ సారథులు ఎంఎస్ ధోని, సచిన్, అజారుద్దీన్ జీవిత చరిత్రలపై బయోపిక్స్ వచ్చాయి. అందులో ధోనీ బయోపిక్ సంచలన విజయం సాధించింది. ఇప్పుడు కపిల్ దేవ్ క్రికెటర్‌గా ఆయన పయనం... ప్రపంచ కప్ గెలవడంపై 83 సినిమా వస్తుంది. ఈ పాత్రలో రణ్వీర్ సింగ్ నటిస్తున్నాడు. కబీర్ ఖాన్ దర్శకుడు కావడంతో అంచనాలు కూడా తారాస్థాయిలోనే ఉన్నాయి. (Twitter/Photo)
ఇప్పటికే విడుదల చేసిన ‘83’ బయోపిక్ ట్రైలర్.. గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. 83 ట్రైలర్ చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్స్ వస్తున్నాయి. ఏ మాత్రం అంచనాలు లేకుండా.. ఒక్క మ్యాచ్ అయినా గెలిస్తే చాలు అనుకునేలా ఇండియా నుంచి ఇంగ్లండ్ వెళ్లి.. అక్కడ ఏకంగా వెస్టిండీస్ లాంటి దిగ్గజ టీమ్‌ను ఓడించి కప్ గెలిచారు భారత్. ఈ సినిమా చూసి కపిల్ దేవ్ భావోద్వేగానికి గురై ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. (Twitter/Photo)
టీమ్ ఇండియా (Team India) మొట్ట మొదటి సారి క్రికెట్ వరల్డ్ కప్ 1983లో (Cricket World Cup 1983) గెలిచింది. అప్పటికి క్రికెట్ అంటే కేవలం వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మాత్రమే. అందులో వన్డే వరల్డ్ కప్ నిర్వహించడం మొదలు పెట్టిన తర్వాత రెండు సార్లు వెస్టిండీస్ (West Indies) విజేతగా నిలిచింది. మూడో సారి కూడా విండీస్ జట్టే ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఆరవీర భయంకరమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉండే విండీస్‌ను అండర్ డాగ్స్‌గా మెగా టోర్నీలోకి అడుగుపెట్టిన భారత జట్టు ఓడించింది.(Twitter/Photo)