80s Stars Re Union: గత కొన్నేళ్లుగా 80వ దశకంలో హీరోలుగా, హీరోయిన్స్‌గా నటించిన స్టార్స్ అంతా కలిసి ఓ సందడి చేస్తున్నారు. ఇక 2019లో 10వ రీ యూనియన్ పార్టీ చిరంజీవి ఇంట్లో గ్రాండ్‌గా జరిగింది. కరోనా కారణంగా 2020,2021లో ఈ 80s నటీనటుల రీ యూనియన్ పార్టీ జరగలేదు. ఇపుడు కరోనా భయం వీడటంతో 11వ సారి 80ల నాటి ఈ తారంతా ఒకచోట చేరారు. ఈ సారి ఈ వేడుకకు ముంబై లోని జాకీఫ్రాఫ్ ఇళ్లు వేదికైంది. (Twitter/Photo)
ఈ సారి చిరంజీవి, వెంకటేష్, అర్జున్, సీనియర్ నరేష్, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, అనుఫమ్ ఖేర్, భాగ్యరాజ్, అనిల్ కపూర్, రాజ్ బబ్బర్‌తో పాటు రాధిక శరత్ కుమార్, రమ్యకృష్ణ, అంబికా, రాధ, లిజి, సుమలత, రేవతి వంటి 80లలో టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్లో అలరించిన హీరో, హీరోయిన్స్ అటెండ్ అయ్యారు. (Twitter/Photo)
కరోనా నేపథ్యంలో ఈ రీ యూనియన్‌కు 2 యేళ్ల గ్యాప్ వచ్చింది. ఇపుడు రెట్టించిన ఉత్సాహాంతో మరోసారి 80ల నాటి నటీనటులు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏమైనా ఇందులో బాలయ్య, మోహన్ లాల్, రజినీకాంత్, నాగార్జున, సుమన్ వంటి హీరోలు లేని లోటు కనిపించిందనే చెప్పాలి. ఇపుడు అందరు ఈ రీ యూనియన్‌కు వాళ్లు రాకపోవడంపైనే చర్చించుకుంటున్నారు. (Twitter/Photo) (80's రీ యూనియన్ ఓల్డ్ ఫోటోస్)