టాలీవుడ్ తారలంటే ఎప్పుడే క్రేజ్. ఎక్కడైనా సరే సెలబ్రిటీల గురించి తెలుసుకునేందుకు జనం ఆసక్తి చూపిస్తారు.వాళ్లు ఏం చేస్తారు. ఏం తింటారు? ఎలా ఉంటారు? ఎక్కడ ఉంటారు? ఇలా ప్రతీ విషయాన్ని కూడా అభిమానులతో పాటు.. మామూలు జనం కూడా తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అది వారి కాస్ల్టీ కార్లైనా. సరే.. వారుండే ఇంద్ర భవనాలు అయినా సరే.. అభిమానులు ప్రతీ విషయాన్ని కూడా ఆసక్తిగా గమనిస్తారు. అయితే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు.. సినిమాలు చేస్తూనే.. మరోవైపు వ్యాపారాలు కూడా చేసేస్తున్నారు. ఓ వైపు కష్టపడి సంపాదిస్తూనే.. మరోవైపు ఆ మొత్తాన్ని పెట్టుబడులుగా పెట్టి వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు.
తాజాగా టాలీవుడ్ రెబల్ స్టార్ బాహుబలి ప్రభాస్ హోటల్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మన సెలబ్రిటీల్లో చాలామందికి హైదరాబాద్‌లో సొంత హోటల్స్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. మీరు కూడా ఆ రెస్టారెంట్, హోటల్స్‌కు వెళ్లొండొచ్చు కానీ.. అవి ఓ సెలబ్రిటీకి చెందినదని మీకు తెలియకుండా ఉండవచ్చు. తాజాగా హైదరాబాద్‌లో ప్రముఖ సెలబ్రిటీలకు చెందిన హోటల్స్.. రెస్టారెంట్స్ ఏంటో ఓలుక్ వేసేద్దాం..
ముందుగా అల్లు అర్జున్ గురించి తెలుసుకుందాం. అల్లు అర్జున్ ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరోలలో ఒకడు. పుష్ప సినిమా ఇచ్చిన హిట్‌తో బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఓవైపు సినిమాలు. మరోవైపు బ్రాడ్ అంబాసిడర్‌గా ప్రకటనలు చేస్తూ రెండు చేతులా సంపాదించేస్తున్నాడు. బన్నీకి కూడా వ్యాపారాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రముఖ హోటల్స్ ఉన్నాయి.
హైలైఫ్ బ్రూయింగ్ కంపెనీ దీని గురించే వినే వింటారు. ఈ కంపెనీని హైదరాబాద్‌కు తీసుకురావడానికి పుష్ప స్టార్ అల్లు అర్జున్ అంతర్జాతీయ హాస్పిటాలిటీ బ్రాండ్ M కిచెన్ మరియు కేదార్ సెలగంశెట్టితో కలిసి పనిచేశారు. ఈ హోటల్ జూబ్లీ హిల్స్‌లో ఉంది. ఉంది.అంతేకాదు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో B-డబ్స్ అకా బఫెలో వైల్డ్ వింగ్స్ ఫ్లాగ్షిప్ అవుట్‌లెట్‌ను కూడా అల్లు అర్జున్, సామ్ రెడ్డి , కేదార్ సెల్గంశెట్టి కలిసి ప్రారంభించారు.
టాలీవుడ్ మన్మథుడు నాగార్జునకు కూడా హైదరాబాద్‌లో ప్రముఖ రెస్టారెంట్స్ ఉన్నాయి. జూబ్లీహిల్స్ వద్ద ఉన్న ఎన్ గ్రిల్ టాలీవుడ్ సూపర్ స్టార్ నాగార్జున, ప్రీతం రెడ్డిలు ప్రారంభించినదే. ఇది ఆధునిక గ్రిల్ హౌస్. దీంతో పాటు జూబ్లీ హిల్స్‌లో ఎన్ ఏషియన్ అనే చైనీస్ రెస్టారెంట్‌ని కూడా నాగ్‌కు సంబంధించినదే కావడం విశేషం.
టాలీవుడ్లో ఓ ప్రముఖమైన సెలబ్రిటీ కుటుంబాల్లో మంచు ఫ్యామిలీ ఒకటి. మంచు లక్ష్మీ కూడా ఈ హోటల్స్ బిజినెస్ ఎప్పుడో ప్రారంభించింది. లక్ష్మి మంచు తన భర్తతో కలిసి హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో జూనియర్ కుప్పన్న అనే సంప్రదాయ సౌత్-ఇండియన్ రెస్టారెంట్‌ని నడుపుతోంది. అయితే, ప్రస్తుతం రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేయబడింది.
ఇక వీరితో పాటు. టాలీవుడ్‌కు చెందిన మరో యంగ్ హీరో నితిన్ కూడా... రెస్టారెంట్ ఒపెన్ చేశాడు. టాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీరజ్ కోనతో కలిసి... నితిన్... హైదరాబాద్‌లోని కావూరి హిల్స్‌లో టి-గ్రిల్ అనే రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ఇలా మన సెలబ్రిటీలంతా రెస్టారెంట్లు, పబ్స్, హోటల్స్ బిజినెస్‌లో ఫుల్ బిజీగా మారారు.