శుక్రవారం అర్థరాత్రి వరకు జరిగిన ఓటింగ్ లో.. యాంకర్ రవికి అత్యధిక ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది. అన్ అఫియస్ ఓటింగ్ లో అన్ని వెబ్ సైట్లను చూస్తే.. అందరికంటే రవీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. తరువాత మానస్ రెండో ప్లేస్ లో, ఆర్జే కాజల్ మూడో ప్లేస్ లో, మోడల్ జెస్సీ నాలుగో ప్లేస్ లో, హమీద ఐదో ప్లేస్ లో, సరయు ఆఖరి ప్లేస్ లో నిలిచినట్టు తెలుస్తోంది.
శనివారం జరిగిన ఎపిసోడ్ లో ఇద్దరిని నాగార్జున సేవ్ చేశారు.. అయితే యాంకర్ రవికి భారీగా ఓట్లు వచ్చాయి అన్నది క్లియర్ గా తెలుస్తోంది. అతడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ క్రేజ్ తెచ్చింది.. అయితే అనూహ్యంగా డేంజర్ జోన్ లో ఉన్న హమీదాను రెండో కంటెస్టెంట్ గా నాగార్జున సేవ్ చయడంతో ఫ్యాన్స్ షాకింగ్ కు గురయ్యారు.
హమీదాను సేవ్ చేయడానికి చాలా కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఓట్లు కాస్త తక్కువగానే వచ్చినా.. ఆమె షోకు చాలా అవసరం అని బిగ్ బాస్ నిర్వహాకులు భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఈ సీజన్ లో లవ్ ట్రాక్ కు ఆమెను వాడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటిక శ్రీరామ చంద్రతో లవ్ ట్రాక్ మొదలైంది. హమీదాను చూస్తుంటే గత సీజన్ లో మోనాల్ గుర్తొస్తోంది. ఆమెకు కూడా ప్రతివారం తక్కువ ఓట్లు పడ్డాయని ప్రచారం జరిగినా.. షో ఎండింగ్ వరకు ఆమెను లాక్కొచ్చారు.
ఇప్పటికే సింగర్ శ్రీరామ చంద్ర -హమీదాల మధ్య లవ్ ట్రాక్ మొదలైంది. ఇప్పుడు షన్ముఖ్ కూడా రేస్ లోకి వచ్చినట్టు ఉన్నాడు. ఎందుకంటే నాగార్జున ఇచ్చిన టాస్క్ లో.. ఎవరితో ఫట్ చేసుకోవాలి అనుకుంటున్నారో.. వాళ్ల ఫోటోను చింపి డస్ట్ బిన్ లో వేయాలని కోరుతారు. అప్పుడు షన్ముఖ్ హమీద పోటోను పట్టుకుని ఇంత అందంగా ఉన్న అమ్మాయిని చింపడం కష్టమే అంటూ మనసును టచ్ చేసే డైలాగ్ చెెప్పాడు.
మోడల్ జెస్సీ ఎలిమినేట్ అయ్యారు అంటూ పలు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం అతడు కూడా ఎలిమినేషన్ ప్రక్రియ నుంచి సేవ్ అయ్యాడని తెలుస్తోంది. ముఖ్యంగా అమాయకంగా ఉండడం.. అందరూ అతడ్ని టార్గెట్ చేశారనే ప్రచారం బాగా జనాల్లోకి వెళ్లింది. అత్యధికమంది నామినేట్ చేయడంతో పాటు.. టాస్క్ ఏది అయినా అందరూ జెస్సీనే కార్నర్ చేస్తూ వచ్చారు. దీంతో అతడికి కూడా అనుకున్నదాని కంటే భారీగానే ఓట్లు వచ్చాయి. దీంతో జెస్సీ సేవ్ అయినట్టు సమాచారం.
ప్రస్తుతం నామినేషన్ లో ఉన్న ఆర్జే కాజల్ కు హౌస్ లో రెబల్ అని ముద్ర పడింది. ఆమె ప్రవర్తనపై చాలామంది హౌస్ మేట్స్ విసుగు చెందారు. కానీ బయట మాత్రం ఆమెకు భారీగానే ఓట్లు పడుతున్నాయి. యాంకర్ రవి, నటుడు మానస్ తరువాత అత్యధిక ఓట్లు సంపాదించుకున్నది కాజల్ మాత్రమే.. దీంతో ఆమె కూడా తొలి వారం సేవ్ అయినట్టే..
ఇక మిగిలింది 7 ఆర్ట్స్ సరయూ మాత్రమే.. అయితే ఇతర హౌస్ మేట్స్ తో పోల్చకుంటే ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమెను ఫాలో అయిన వారు ఓట్లు వేసినా ఆమె సేవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ అనూహ్యంగా ఆమె ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. ఆమెతో సమానంగా హమీదకు ఓట్లు వచ్చినా.. లవ్ ట్రాక్ కోసం ఆమెను సేవ్ చేసి.. సరయును ఇంటికి పంపినట్టు తెలుస్తోంది.అయితే హౌస్ లో ఆమె యాటిట్యూడ్ చాలామందికి నచ్చలేదు. మరోవైపు స్మోకింగ్ చేయడం లాంటివి కూడా ఆమెకు మైనస్ అయ్యాయి. అందుకే ఓటింగ్ లో ఆ ప్రభావం కనిపించింది. అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి కూడా.. ఓట్లలో పూర్తిగా సరయు వెనుకబడ్డారు. దీంతో ఈ రోజు ఆమె హౌస్ ను వీడనున్నట్టు తెలుస్తోంది.