68Th National Film Awards | జాతీయ చలన చిత్ర పురస్కరాలు అందుకోవడం మన నటీనటులకు జీవిత కాలపు కల. జీవితంలో ఒక్కసారైన జాతీయ అవార్డు అందుకోవాలని మన హీరో, హీరోయిన్లు ఉవ్విళూరుతుంటారు. అందులో కొంత మంది నటులు ఒక్కసారి కాదు.. రెండు అంత కంటే ఎక్కువ సార్లు ఈ జాతీయ అవార్డులు అందుకున్నారు. తాజాగా తానాజీ సినిమాతో అజయ్ దేవ్‌గణ్ జాతీయ ఉత్తమ నటుడిగా మూడోసారి ఈ అవార్డు అందుకోనున్నారు. ఈయన కంటే ముందు రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న నటుల విషయానికొస్తే..
అజయ్ దేవ్‌గణ్ | ఆర్ఆర్ఆర్ ఫేమ్ అజయ్ దేవ్‌గణ్ మొదటి సారి 46వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా 1998 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ‘జక్మ్’ సినిమాలోని నటనకు అజయ్ దేవ్‌గణ్ కూడా ఈ జాతీయ అవార్డును మమ్ముట్టితో సంయుక్తంగా అందుకున్నారు. ఆ తర్వాత 50వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా 2002 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ’ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్’ అనే హిందీ సినిమాలోని నటనకు గాను రెండోసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. తాజాగా అజయ్ దేవ్‌గణ్ 2020 యేడాదిగాను 68వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో భాగంగా మూడోసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకోనున్నాడు. ఈయన ఈ అవార్డును సూర్యతో పంచుకోనున్నాడు. (File/Photo)
అమితాబ్ బచ్చన్ | అమితాబ్ బచ్చన్ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో భాగంగా మొత్తంగా నాలుగు సార్లు ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. మొదటిసారి ‘అగ్నిపథ్’ రెండోసారి ‘బ్లాక్’ సినిమాలోని నటనకు అందుకుంటే.. మూడోసారి ‘పా’ సినిమాలో నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకుంటే.. నాల్గోసారి జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ’పీకూ’ అనే హిందీ సినిమాలోని నటనకు గాను అమితాబ్ బచ్చన్ జాతీయ అవార్డు అందుకున్నారు. మొత్తంగా నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకొని రికార్డు క్రియేట్ చేసారు. ఇక అమితాబ్ తొలిసారి వెండితెరపై కనిపించిన ‘సాత్ హిందూస్థానీ’ సినిమాలోని నటనకు ఉత్తమ సహాయ నటుడు అవార్డు అందుకోవడం విశేషం. (Twitter/Photo)
కమల్ హాసన్ | కమల్ హాసన్ కూడా మొదటిసారి 30వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా 1982 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ‘మూండ్రమ్ పిరాయ’ (వసంత కోకిల) అనే తమిళ సినిమాలోని నటనకు గాను కమల్ హాసన్ మొదటిసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత రెండోసారి మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాయకన్’ (నాయకుడు) సినిమాకు గాను, మూడోసారి (ఇండియన్) భారతీయుడు సినిమాకు గాను ముచ్చటగా మూడుసార్లు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. (Twitter/Photo)
మమ్ముట్టి | 37వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా 1989 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ‘మతిలుకల్’, ’ఓరు ఒడుక్కన్ వీరగాథ’ అనే మలయాళ సినిమాల్లోని నటనకు గాను మమ్ముట్టి మొదటి సారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. రెండోసారి 41వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా 1993 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ‘పొంతన్ మద’, ’విధేయన్’ అనే మలయాళ సినిమాల్లోని నటనకు గాను మమ్ముట్టి రెండోసారి జాతీయ అవార్డును అందుకున్నారు. మూడో సారి 46వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా 1998 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ’డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్’ అనే ఇంగ్లీష్ సినిమాలోని నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు మమ్ముట్టి. (File/Photo)
మోహన్‌లాల్ | 39వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా 1991 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ‘భరతమ్’ అనే మలయాళ సినిమాలోని నటనకు గాను మోహన్‌లాల్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. రెండోసారి 47వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా 1999 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ’వానప్రస్థం’ అనే మలయాళ సినిమాలోని నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న మోహన్‌లాల్. మొత్తంగా రెండు సార్లు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత మూడు సార్లు ఉత్తమ నటుడిగా స్పెషల్ జ్యూరీ అవార్డు మొత్తంగా 5 సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. (Twitter/Photo)
ధనుశ్ | 58వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా 2010 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ’ఆడుకాలమ్’ అనే తమిళ సినిమాలోని నటనకు గాను థనుశ్ మొదటిసారి జాతీయ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును మలయాళ నటుడు సలీమ్ కుమార్‌తో పంచుకున్నారు. రెండోసారి కూడా 67వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా 2019 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ‘అసురన్’ అనే తమిళ సినిమాలోని నటనకు ధనుశ్ రెండోసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును ‘భోంస్లే ’ అనే హిందీ సినిమాలోని యాక్టింగ్‌కు మనోజ్ బాజ్పేయ్తో పంచుకున్నారు.(Twitter/Photo)
మిథున్ చక్రబర్తి | 24వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా 1976 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ‘మృగయ’ అనే హిందీ సినిమాలోని నటనకు గాను మిథున్ చక్రబర్తి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. హీరోగా మిథున్ చక్రబర్తి తొలి సినిమా ఇదే. ఫస్ట్ మూవీతోనే జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న హీరోగా మిథున్ చక్రబర్తి రికార్డులకు ఎక్కాడు. ఆ తర్వాత 40వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా 1992 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ‘తాహెదార్ కథ’ అనే బెంగాలీ సినిమాలోని నటనకు గాను మిథున్ చక్రబర్తి రెండో సారి జాతీయ అవార్డును అందుకున్నారు. ఇలా రెండు భాషల్లో నటనకు అవార్డు అందుకున్న ఏకైక నటుడుగా కూడా మిథున్ రికార్డులకు ఎక్కారు. (File/Photo)
నసీరుద్దీన్ షా | 27వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా 1979 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ‘స్పర్ష్’ అనే హిందీ సినిమాలోని నటనకు గాను నసీరుద్దీన్ షా మొదటిసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత 32వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా 1984 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ‘పార్’ అనే హిందీ సినిమాలోని నటనకు గాను నసీరుద్దీన్ షా జాతీయ ఉత్తమ నటుడి అవార్డును రెండోసారి అందుకున్నారు. (File/Photo)
ఓంపురి | 29వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా 1981 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ‘ఆరోహణ్’ అనే హిందీ సినిమాలోని నటనకు గాను ఓం పురి మొదటిసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత రెండోసారి 31వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా 1983 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ‘అర్ధ సత్య’ అనే హిందీ సినిమాలోని నటనకు గాను ఓం పురి రెండోసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. (File/Photo) (File/Photo)
సంజీవ్ కుమార్ | 18వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా 1970 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ‘దస్తక్’ అనే హిందీ సినిమాలోని నటనకు గాను సంజీవ్ కుమార్ మొదటిసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత 20వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా 1972 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ‘కోషిష్’ అనే హిందీ సినిమాలోని నటనకు గాను సంజీవ్ కుమార్ రెండోసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. (File/Photo)
నాగార్జున అక్కినేని | నాగార్జున జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోక పోయినా.. 1996లో ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాకు జాతీయ ఉత్తమ చిత్రంగా నిర్మాతగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత 1997లో కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేసిన ‘అన్నమయ్య’ సినిమాలోని నటనకు స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు. ఈ రకంగా రెండు జాతీయ అవార్డులతో తెలుగులో నాగార్జున ఓ రికార్డు క్రియేట్ చేసారనే చెప్పాలి. (Twitter/Photo)