టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. ఈ సినిమాను ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. 'సాహో', 'రాధేశ్యామ్' వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల తర్వాత ప్రభాస్ 'ఆదిపురుష్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి.
ఆదిపురుష్ వాయిదా పడటంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులను తిరిగి పర్ఫెక్ట్గా చేయనుండటంతో ఈ సినిమాకు కేటాయించిన బడ్జెట్ మరో వంద కోట్లు పెరుగుతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయినా కూడా నిర్మాతలు ఏమాత్రం వెనకడుగు వేయకుండా, ప్రేక్షకులకు అదిరిపోయే ఫీస్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట.
అయితే వాయిదాల పర్వంతో పాటు.. బడ్జెట్ కూడా మరో వంద కోట్లుపెరగడంతో ఇప్పుడు ఆదిపురుష్ సినిమా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆదిపురుష్ భారతదేశంలో అత్యధిక బడ్జెట్ చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. గతంలో ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 450కోట్లు. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర సినిమాకు సమానం. తాజా అప్డేట్ల ప్రకారం, మేకర్స్ ఈ చిత్రాన్ని రీవర్క్ చేస్తున్నందున 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని సమాచారం. దీంతో ఇప్పుడు ఆదిపురుష్ బడ్జెట్ కాస్త రూ. 550 కోట్లకు చేరింది. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది.
ప్రభాస్ కార్టూన్‌గా కనిపించడం మరియు ఓవరాల్‌గా ఉపయోగించిన తక్కువ VFX కారణంగా సినిమా టీజర్‌పై చాలా విమర్శలు రావడంతో ఆదిపురుష్ విడుదల తేదీ వాయిదా పడింది. రాముడు మరియు హనుమంతుడు తోలు పట్టీలు ధరించినట్లు చూపించినందుకు కూడా ఒక పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి ఆదిపురుష్ టీంకు నోటీసులు కూడా అందాయి. టీజర్ ప్రేక్షకులను సంతృప్తి పరచడంలో విఫలమైందని తెలుస్తుంది.
మరోవైపు ఈ సినిమాను తమిళంలో విడుదల చేసే సమయానికీ విజయ్, అజిల్ సినిమాలున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఎక్కువ స్క్రీన్స్ దొరికే అవకాశలు లేవు. మరోవైపు తెలుగులో బాలయ్య, వీర సింహారెడ్డి, చిరు.. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలున్నాయి. ఈ సినిమా తెలుగు సహా అన్ని భాషల్లో 10 రోజులు అన్ని థియేటర్స్‌లో ఈ సినిమా విడుదల చేస్తే కానీ వర్కౌట్ కాదు. ఈ నేపథ్యంలో ఆదిపురుష్‌ను సోలో రిలీజ్ డేట్ కోసం మార్పులు చేసినట్లు కూడా తెలుస్తోంది.