F3 OTT Streaming Date :| అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన మూవీ ఎఫ్ 3. ఎఫ్ 2 మూవీకి సీక్వెల్‌గా అని చెప్పినా.. అదే నటీనటులతో కొత్త కాన్సెప్ట్‌తో ఎఫ్ 3 మూవీ తెరకెక్కించారు. రొటీన్ కామెడీ ఎంటర్టేనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. (Photo Twitter)
దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎఫ్ 2కి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం కూడా మంచి హిట్టయ్యింది. సినిమా విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ సినిమా ఈరోజు నుంచి అంటే జూలై 22 నుంచి రెండు ప్రముఖ ఓటీటీల్లో సోనీ లివ్‌తో పాటు నెట్ ఫ్లిక్స్‌లలో అందుబాటులోకి వచ్చేసింది. వెంకటేష్, వరుణ్‌లకు జంటగా తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటించారు. దిల్ రాజు నిర్మించారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. మరో ఇంట్రెస్టింగ్ రోల్లో సోనాల్ చౌహన్ కనిపించింది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. Photo : Twitter
ఈ సినిమా సోనీలివ్‌తో పాటు నెట్ ఫ్లిక్స్‌తో కూడా అందుబాటు వచ్చింది. అయితే దీనికి ఓ కారణం ఉంది. నెట్ ఫ్లిక్స్‌తో పోల్చితే.. సోనీ లివ్‌కి సబ్ స్క్రైబర్స్ రీచ్ తక్కువ. దీంతో ‘ఎఫ్3’ సినిమాను ఎక్కువమంది ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్‌తో పంచుకుంటోందని తెలుస్తోంది. ఇక ఇలాంటిదే గతంలో కూడా జరిగిన సంగతి తెలిసిందే. సన్ నెక్స్ట్ ‘అల.. వైకుంఠపురములో’, ‘డాక్టర్’, ‘ఈటీ’, ‘పెద్దన్న’ వంటి సినిమాలను నెట్ ఫ్లిక్స్‌తో పంచుకున్న సంగతి తెలిసిందే. Photo : Twitter
F3 మూవీ యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 1 మిలియన్ డాలర్స్ వసూళు చేసింది. F3 మూవీలో ప్రేక్షకులకు ఈ సినిమాకు కావాల్సినంత వినోదం ఉండటంతో కామన్ ఆడియన్స్ ఈ సినిమాకు బాగానే కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషక్షన్స్ విషయానికి వస్తే.. ఎఫ్ 3, నైజాంలో 20 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి అరుదైన ఫీట్‌ను సాధించింది. ఈ సినిమా తన లైఫ్ టైమ్ రన్లో ఎపీ, తెలంగాణలో 53.94 Cr షేర్‌ను సాధించగా.. ప్రపంచవ్యాప్తంగా 70.94 Cr షేర్ వసూలు చేసింది. ఎఫ్3 ప్రపంచవ్యాప్తంగా రూ. 134 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. Photo : Twitter
సినిమా ఏరియాల వారీగా చూస్తే.. నైజాం- 20.57 కోట్లు, ఉత్తరాంధ్ర- 7.48 కోట్లు, తూర్పు- 4.18 కోట్లు, వెస్ట్ - 3.41 కోట్లు, కృష్ణ - 3.23 కోట్లు, గుంటూరు - 4.18 కోట్లు, నెల్లూరు- 2.31 కోట్లు, సీడెడ్- 8.58 కోట్లు, కర్ణాటక - 5 కోట్లు, రెస్టా ఆఫ్ ఇండియా 2 కోట్లు, ఓవర్సీస్ - 10 కోట్లు వసూలు అయినట్లు ఎఫ్ 3 టీమ్ అధికారికంగా ప్రకటించింది. Photo : Twitter
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. జీవితంలో బంధాలకు, అనుబంధాలకు విలువ లేదనీ, డబ్బే సర్వమని నమ్మిన కొంతమంది వ్యక్తులు దానిని ఈజీగా సంపాదించడానికి చేసే ప్రయత్నమే ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాలో వెంకటేష్ .. రే చీకటితో బాధపడే వ్యక్తి పాత్రలో నటిస్తే.. వరుణ్ తేజ్.. నత్తితో బాధపడే వ్యక్తి పాత్రలో నటించారు. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ నటించారు. తాజాగా సోనీ లివ్‌లో ఈ నెల 22 నుంచి F3 మూవీ స్ట్రీమింగ్ కానున్నట్టు అఫీషియల్ ప్రకటన చేసారు. మరి వెండితెరపై మంచి విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీ వేదికగా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. (Twitter/Photo)