January Tollywood Box Office Report 2023: తెలుగు సినిమాకు సంక్రాంతి పండుగ అనేది పెద్ద మార్కెట్ అని తెలిసిందే. ఈ సీజన్’కు టార్గెట్ చేసుకుని సినిమాలను ప్లాన్ చేస్తుంటారు దర్శకనిర్మాతలు. సినిమా ఏమాత్రం బాగున్నా వసూళ్ల వర్షం కురుస్తుంది. 2021, 2022 కరోనా సమయంలో పెద్ద చిత్రాలు రిలీజ్ కాలేకపోయాయి. ఇక 2023 యేడాదిలో మాత్రం బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి తో పాటు చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ తో పాటు విజయ్ ‘వారసుడు’, అజిత్ ‘తునివు’ మూవీలు రోజులు గ్యాప్‌లో ప్రేక్షకులు ముందుకు వచ్చాయి.
2023లో అపుడే జనవరి నెల అయిపోయింది. ఈ నెలలో అత్యంత కీలకమైన సంక్రాంతి సీజన్లో రెండు డైరెక్ట్ చిత్రాలు.. రెండు డబ్బింగ్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర లక్ పరీక్షించుకున్నాయి. అందులో బాలయ్య .. వీరిసింహారెడ్డితో పలకరిస్తే.. చిరంజీవి.. వాల్తేరు వీరయ్యతో దుమ్ము దులిపాడు. మొత్తంగా 2023 జనవరిలో ఎవరు విజేతలు.. ఎవరు పరాజితులనేది మీరు ఓ లుక్కేయండి.. (Photo : Twitter)
తెలుగులో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన ఈ సినిమా తమిళంలో హిట్ అనిపించుకుంది. రూ. 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ఇక్కడ రూ. 2.16 కోట్ల షేర్ రాబట్టింది. రూ. 1.36 కోట్ల దూరంలో నిలిచింది. కానీ తమిళంలో మాత్రం రూ. 85 కోట్ల ప్రీ రిలీజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా రూ. 97.10 కోట్ల రాబట్టి తమిళంలో హిట్ స్టేటస్ అందుకుంది.
అటు బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’కి తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ సాధించింది. రూ. 73 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం రూ. 74 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలో దిగింది. మొత్తంగా ఈ సినిమా రూ. 80 కోట్ల షేర్ (రూ. 133 కోట్ల గ్రాస్) తో హిట్ స్టేటస్ అందుకుంది. (Twitter/Photo)
జనవరి 13న విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తొలి రోజు నుంచి దుమ్ము దులుపుతూ సంక్రాంతి సీజన్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రూ. 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ చిత్రం .. ఇప్పటి వరకు రూ. 134.37కోట్లు షేర్ (రూ. 223.15 కోట్ల గ్రాస్) రాబట్టింది. ఓవరాల్‌గా రూ. 46 కోట్ల వరకు లాభాలను ఆర్జించింది. (Twitter/Photo)
ఈ సినిమాలో చిరంజీవి, రవితేజ సవతి సోదరులుగా నటించారు. ఛిరంజీవి.. ఆంధ్ర వ్యక్తి పాత్రలో నటిస్తే..రవితేజ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి గా కనిపించారు. ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా మంచి శుభారంభంతో పాటు తొలి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న చిత్రంగా వాల్తేరు వీరయ్య నిలిచింది. (Twitter/Photo)
మొత్తంగా జనవరిలో విడుదలైన చిత్రాల్లో చిరు ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్‌గా నిలిచి విన్నర్‌గా నిలిచింది. అటు బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సినిమా బాక్సాఫీస్ బరిలో రన్నర్‌గా నిలిచి హిట్ స్టేటస్ దక్కించుకుంది. అటు విజయ్ ‘వారసుడు’ సినిమా ఎలాగో హిట్ స్టేటస్ దక్కించుకుంది. అటు అజిత్ ‘తెగింపు’ ఓ మోస్తరు విజయంతో తెలుగులో యావరేజ్‌గా నిలిచింది. ఏది ఏమైనా 2023కు సంక్రాంతి సినిమాలు మంచి శుభారంభం ఇచ్చాయనే చెప్పాలి. (Twitter/Photo)