2022 Tollywood Top Share Movies : 2022 టాలీవుడ్లో RRR హైయ్యెస్ట్ గ్రాసర్ ఆర్ఆర్ఆర్ మూవీ నిలిచింది. అంతేకాదు ఓవరాల్‌గా ఈ సినిమా తెలుగులో హైయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది. అబౌ యావరేజ్‌గా నిలిచిన సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ సినిమాలు ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్టులో చేరాయి. (Twitter/Photo)
1..RRR 1st Day World Wide Highest Share Movies: టాలీవుడ్లో బడా హీరో సినిమా విడుదలైతే.. ఆ రచ్చే వేరుగా ఉంటోంది. మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు మోత మోగడం ఖాయం. తాజాగా విడుదలైన ’ఆర్ఆర్ఆర్’తో మరోసారి ఇదే జరిగింది. ఆర్ఆర్ఆర్ విడుదలతో తెలుగులో మరోసారి రికార్డుల వేట మొదలైంది. నైజాంలో పెద్ద సినిమాల టోటల్ కలెక్షన్స్‌ను ఆర్ఆర్ఆర్ మూవీ మొదటి రోజే వసూళు చేసి అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో నైజాం సహా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రికార్డులు మటు మాయమయ్యాయి. (RRR movie)
ఆర్ఆర్ఆర్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీ విజయం విజయం సాధించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రికార్డు క్రియేట్ చేసింది. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు.. రూ. 135 కోట్ల షేర్ రాబట్టింది. అంతేకాదు తెలుగు రాష్ట్రాలల్లో బ్రేక్ ఈవెన్ సాధించి ఇప్పటి వరకు రూ. 234 కోట్ల షేర్ .రాబట్టింది. ఇక ఓవర్సీస్ తెలుగు వెర్షన్ రూ. 59.50 కోట్లు రాబడితే.. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా తెలుగు కలెక్షన్లు రూ. 33.80 కోట్లు కలిపితే.. ఓవరాల్‌గా రూ. 327.80 కోట్లతో బాహుబలి 2 తెలుగు వెర్షన్ రికార్డులను బ్రేక్ చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా రూ. 614.06 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. (Twitter/Photo)
2.సర్కారు వారి పాట | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమా చేసారు. ఈ సినిమా మే 12న విడుదలైన మంచి వసూళ్లను సాధించింది. ఈ సినిమా 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా రూ. 110.12 కోట్లు వసూళ్లు చేసింది. మొత్తంగా బ్రేక్ ఈవెన్‌కు రూ. 10.88 కోట్ల దూరంలో ఆగిపోయింది. అంతేకాదు మొత్తంగా అన్ని ఏరియాల్లో ఈ సినిమా 91 శాతం రికవరీ పూర్తి చేసుకొని అబౌ యావరేజ్ మూవీగా నిలిచింది. . Mahesh Babu Photo : Twitter
3.కెజియఫ్ ఛాప్టర్ 2 | కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో ఎక్కువ మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ. ఈ చిత్రం మొదటి భాగం కేజీఎఫ్ చాఫ్టర్ 1తో యశ్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఈ సినిమా రెండో భాగం ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఆర్ఆర్ఆర్ తర్వాత దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. అంతేకాదు రూ. 1000 కోట్ల క్లబ్బులో చేరిన మూడో సౌత్ సినిమాగా నిలిచింది. అంతేకాదు ఆర్ఆర్ఆర్ తర్వాత ఒక నెల గ్యాప్‌లో రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 602.60 కోట్లు షేర్ (రూ. 1233 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. తెలుగులో మాత్రం రూ. 103 కోట్ల షేర్ రాబట్టింది. (KGF Chapter 2 Photo : Twitter)
4. భీమ్లా నాయక్: ఫిబ్రవరిలో వచ్చిన అతిపెద్ద సినిమా భీమ్లా నాయక్. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలైంది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించిన ఈ చిత్రం మొదటి 3 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్.. 70 కోట్ల షేర్ వసూలు చేసింది. ఫిబ్రవరిలో విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా భీమ్లా నాయక్ రికార్డులు తిరగరాసింది. మొత్తంగా ఫిబ్రవరి టీజే టిల్లు బ్లాక్ బస్టర్‌గా నిలిస్తే.. భీమ్లా నాయక్ అబౌ యావరేజ్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.63 కోట్ల షేర్ రాబట్టి 4వ స్థానంలో నిలిచింది. (File/Photo)
5. రాధే శ్యామ్: ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియన్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. ఈ చిత్రం మార్చ్ 11న విడుదలైంది. క్లాస్ లవ్ స్టోరీగా రిచ్‌గా తెరకెక్కిన ఈ సినిమా మొత్తంగా రూ. 202 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 84.70 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 120 కోట్లు నస్టాలతో మన దేశంలోనే 2022 బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. (Twitter/Photo)
6.F3 | విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన మూవీ ‘F3’. ఈ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాపై టాలీవుడ్లో ఎన్నో అంచనాలున్నాయి. దిల్ రాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా మే 27న విడుదలై రూ. 56.91 కోట్ల షేర్ రాబట్టి 6వ ప్లేస్‌లో నిలిచింది. (F3 Movie Photo : Twitter)
7. ఆచార్య | చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఆచార్యలో నటించారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ఎప్రిల్ 29న విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.. ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ద అనే కామ్రేడ్ పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 131.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజనెస్ చేసింది. ఓవరాల్‌గా రూ. 48.36 కోట్ల షేర్ రాబట్టి.. రూ. 84.14 కోట్ల నస్టాలను తీసుకొచ్చింది. ఓవరాల్‌గా 2022లో ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల్లో ఎక్కువ షేర్ తీసుకొచ్చిన చిత్రాల్లో 7వ స్థానంలో నిలిచింది.
8.బంగార్రాజు | నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన సినిమా బంగార్రాజు. జవవరి 14న విడుదలైన ఈ సినిమా 2022లో తొలి హిట్‌గా నిలిచింది. మొత్తంగా తొలి బ్రేక్ ఈవెన్ అందుకోని తెలుగులోనే కాదు.. మొత్తం దేశంలోనే తొలి హిట్ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 39.15 కోట్ల షేర్ రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. ఓవరాల్‌గా 2022లో ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల్లో ఎక్కువ షేర్ తీసుకొచ్చిన చిత్రాల్లో 8వ స్థానంలో నిలిచింది. (Twitter/Photo)
8. మేజర్ | అడివి శేష్ టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ ‘మేజర్’ మూవీ. ఈ సినిమాకు అడివి శేష్.. కథ, స్క్రీన్ ప్లే సమకూర్చుకున్నారు. ఈ మూవీపై విడుదలైన మూడు రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. అంతేకాదు ఫస్ట్ వీకెండ్ లోపే ఈ సినిమా లాభాల్లోకి వచ్చింది. ‘మేజర్’ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రూ. 13 కోట్లకు అమ్మారు. ప్రపంచ వ్యాప్తంగా అదనంగా రూ. 5 కోట్లు కలిపి రూ. 18 కోట్లకు అమ్ముడుపోయింది. రూ. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన మేజర్ మూవీ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 17.85 కోట్ల షేర్ (రూ. 29.80 కోట్ల గ్రాస్) రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మిగతా భాషల్లో కలిపి ఈ సినిమా రూ. 33.35కోట్ల షేర్ (రూ. 64 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఓవరాల్‌గా 2022లో ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల్లో ఎక్కువ షేర్ తీసుకొచ్చిన చిత్రాల్లో 9వ స్థానంలో నిలిచింది. (Twitter/Photo)