Tollywood Deaths 2022: ఈ యేడాది టాలీవుడ్‌కు ఒక రకంగా బ్యాడ్ ఇయర్ అని చెప్పారు. తెలుగు సినీ రంగాన్ని కొన్ని దశాబ్దాలపాటు హీరోగా శాసించిన కృష్ణ, కృష్ణంరాజుతో పాటు వారితో సరిమానంగా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన సత్యనారాయణతో చలపతి రావు కూడా ఈ యేడాదే కన్నుమూయడం విషాదకం. మొత్తంగా 2022లో కన్నుమూసిన సినీ ప్రముఖుల విషయానికొస్తే..
తెలుగుతెరపై ఒకదానితో ఒకటి సంబంధంలేని పాత్రలతో విలక్షణమైన నటనతో నవరస నటనా సార్వభౌముడు అనిపించుకున్నారు సత్యనారాయణ. మహానటుడు ఎస్వీరంగారావు నట వారసుడిగా తెలుగు సినిమా స్వర్ణయుగ చరిత్రలో ఆయనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకున్న విలక్షణ నటుడు. డిసెంబర్ 23న తెల్లవారుఝామున కన్నుమూసారు. మొత్తంగా 2022లో కన్నుమూసిన సినీ ప్రముఖుల విషయానికొస్తే.. (Kaikala Satyanarayana Death)
తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన సూపర్‌స్టార్. నటుడిగా, దర్శకుడిగా, ఎడిటర్‌గా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ ఈయనే. అన్నింటికి మించి ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన సాహసి. అంతేకాదు తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయనే ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో కూడా అతనే. టెక్నికల్ గా తెలుగు సినిమాను ఎన్నో ఎత్తులకు చేర్చిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ.15/11/2022న కోట్లాది అభిమానులను శోక సంద్రంలో ముంచుతూ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఈయన మృతితో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక శకం ముగిసిందనే చెప్పాలి. (File/Photo)
Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు.. హీరోగా ప్రత్యేకమైన మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను, అభిమానులను సంపాదించుకున్న కథానాయికుడు. హీరోగా మొదలు పెట్టి.. ఆ పై విలన్ గా మారి.. ఆపై కథానాయకుడిగా రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈయన సెప్టెంబర్ 11న తుది శ్వాస విడిచారు. ఈయన తెలుగు సినీ పరిశ్రమలో కథానాయకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. (Twitter/Photo)
బాలయ్య | టాలీవుడ్ సీనియర్ నటుడు బాలయ్య ఏప్రిల్ 9 కన్నుమూశారు. నటుడిగా 300కిపైగా చిత్రాల్లో నటించారు బాలయ్య. ఎత్తుకు పైఎత్తు చిత్రంతో నటుడు అయ్యారు. నిర్మాతగా, దర్శకుడుగా, కథా రచయితగా తన ప్రతిభ చూపారు.ఆయన నిర్మాతగా అమృత ఫిల్మ్స్ సంస్థ ద్వారా చెల్లెలి కాపురం (శోభన్ బాబు హీరో) నేరము - శిక్ష (కృష్ణ హీరో. కె. విశ్వనాథ్ దర్శకుడు) చుట్టాలున్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట (చిరంజీవి హీరో) లాంటి చిత్రాలు బాలయ్య నిర్మించారు.
దర్శకుడు శరత్ | ఏప్రిల్ 1 సినీయర్ దర్శకుడు శరత్ కన్నుమూసారు. ఈయన కృష్ణ హీరోగా తెరకెక్కిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసారు. ఆ తర్వాత ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వ శాఖలో అసోసియేట్‌గా పనిచేసారు. సుమన్ హీరోగా తెరకెక్కిన ‘చాదస్తపు మొగుడు’ సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఈయన ఎక్కువగా బాలయ్య, సుమన్‌లతో సినిమాలను తెరకెక్కించారు. (Twitter/Photo)
కందికొండ యాదగిరి | కందికొండ యాదగిరి ముఖ్యంగా యాస, భాష, సంస్కృతి ప్రజలకు చేరువ చేసారు. తెలంగాణ సంస్కృతి పై ఎన్నో గీతాలను రాశారు. ముఖ్యంగా ఆయన పాట రాస్తే పదాలు గలగల పారే గోదారిలా పరుగులు పెడతాయి. కొమ్మల మాటున గువ్వలు మళ్లీ మళ్లీ కూస్తాయి. మనసుండే చోటు చెప్పమంటూ ప్రేక్షకుల హృదయాలను ప్రశ్నిస్తాయి. తెలుగు సినీ సాహిత్యంలో నయాట్రెండ్ సెట్ చేసిన రచయిత కందికొండ. మార్చి 12న కన్నుమూసారు. (File/Photo)
ప్రదీప్ కొట్టాయం | మలయాళీ నటుడు ప్రదీప్ కొట్టాయమ్ గుండెపోటుతో ఫిబ్రవరి 17న కన్నుమూసారు. 40 లేటు వయసులో 2001లో నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఈయన 70పైగా సినిమాల్లో కమెడియన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన రాజా రాణి, ఏమాయ చేసావే వంటి చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా ఏమాయ చేసావే సినిమాలో జార్జ్ అంకుల్ పాత్ర ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది. (File/Photo)
కేపీఏసీ లలిత | మలయాళంలో వందల సినిమాల్లో నటించిన సీనియర్ నటి కేపీఏసీ లలిత (KPAC Lalitha passes away) ఫిబ్రవరి 22న త్రిపుణితురలో మరణించారు. ఈ లెజెండరీ నటి మలయాళం సినిమా కమర్షియల్ సినిమాలతో పాటు ఆర్ట్ స్కూల్ రెండింటిలోనూ రాణించింది. కేపీఏసీ లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మ. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈమె తన పేరు మార్చుకున్నారు. ఆమె చాలా సంవత్సరాలు సినిమా పరిశ్రమలో పని చేశారు. 50 దశాబ్దాల కెరీర్లో 550కి పైగా చిత్రాల్లో నటించింది కవిత. (kapc lalitha)
బప్పీలహరి | బాలీవుడ్ కు డిస్కో మ్యూజిక్‌ను పరిచయం చేసిన పాటగాడు...ఫ్యాషన్ ఐకాన్ గా నిలిచిన సంగీత దర్శకుడు బప్పీలహరి. సంగీతంతో శ్రోతలను డిస్కో ఆడించే రింగ్ మాస్టర్...గానంతో మెస్మరైజ్ చేసి, సెన్సేషన్ క్రియేట్ చేసే డిస్కో సింగర్...సంగీతం, పాటలతోనే కాదు తనదైన ప్రత్యేక గెటప్ తోనూ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సంగీత దర్శకుడు.. సింగర్ బప్పిలహరి. ఈయన ఫిబ్రవరి 16న ఈ లోకాన్ని విడిచివెళ్లారు. (Twitter/Photo)
సంధ్య ముఖర్జీ |బెంగాలీ చిత్ర పరిశ్రమలో తన గానామృతంతో ఓలలాడించిన సంధ్య ముఖర్జీ.. ఫిబ్రవరి 15న ఈ లోకాన్ని విడిచివెళ్లారు. తన గానంతో ఓ జాతీయ అవార్డుతో పాటు బంగ బిభూషణ్ అవార్డు సైతం అందుకున్నారు. తాజాగా కేంద్రం ఈమెకు 2022కు పద్మశ్రీ ప్రకటించారు. కానీ ఈమె ఈ అవార్డును ఆలస్యంగా ఇచ్చినందకు పద్మశ్రీ బిరుదును తిరస్కరించారు. (File/Photo)
ఢిల్లీ , రైతుల ట్రాక్టర్ ర్యాలీ" width="1200" height="800" /> దీప్ సిద్ధు | గతేడాది జనవరిలో జరిగిన రిపబ్లిక్ డే (Republic Day) హింసాకాండ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన పంజాబీ నటుడు దీప్ సిద్ధూ రోడ్డు ప్రమాదంలో ఫిబ్రవరి 16న మరణించారు. ఢిల్లీని దాటవేసే కుండ్లీ-మనేసర్-పల్వాల్ (కేఎంపీ) ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. గతేడాది ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజు జరిగి అల్లర్లు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అల్లర్లో నిందితుడిగా దీప్ సిద్దూ (Deep Sidhu) ఉన్నారు. (File/Photo)
ప్రవీణ్ కుమార్ సోబ్తీ | బిఆర్ చోప్రా తెరకెక్కించిన మహాభారతం ఈయన్ని స్టార్‌గా మార్చేసింది. 1988 నుంచి 1990 మధ్య కాలంలో 94 ఎపిసోడ్స్‌గా ప్లే అయిన మహాభారత్‌లో ఆయన భీముడిగా భారత ప్రజలకు చేరువయ్యారు. ఈయన్ని సొంత పేరు ప్రవీణ్ కుమార్ సోబ్తీ కంటే కూడా భీమా అనే అంతా పిలుస్తుంటారు. ఇప్పటికీ ప్రవీణ్ అంటే చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈయన ఫిబ్రవరి 8న అనారోగ్యంతో కన్నుమూసారు. ఈయన అంతం కాదిది ఆరంభం, ప్రజా ప్రతినిధి, మైఖేల్ మదన కామరాజు వంటి పలు తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా నటించారు. (File/Photo)
రవి టాండన్ | రవీనా టాండన్ తండ్రి, ప్రముఖ రచయిత, దర్శక నిర్మాత అయిన రవి టాండన్ కన్నుమూసారు. కొన్ని రోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న ఆయన.. ఫిబ్రవరి 11న ముంబై హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఈయన వయసు 85 సంవత్సరాలు. రవి టాండన్ 1963లో సునీల్ దత్ నిర్మాణంలో 'యే రాస్తే హై ప్యార్ కే'తో ప్రారంభమైన తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన పెద్ద హీరోలతో కూడా పని చేసారు. 'ఖేల్ ఖేల్ మే,' 'అన్హోనీ లాంటి చాలా సినిమాలను తెరకెక్కించారు రవి టాండన్. ,' 'నజరానా', 'మజ్బూర్', 'ఖుద్-దార్', 'జిందగీ లాంటి హిట్ సినిమాలు రవి టాండన్ ఖాతాలో వున్నాయి. ఆయన మంచి ఫామ్‌లో ఉన్నపుడే కూతురు రవీనా టాండన్‌ను కూడా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం చేసారు. (raveena tandon)
లతా మంగేష్కర్ ,,ఎల్ కే అద్వానీ,LK Adavi,Rath Yatra Signature Tune లతా మంగేష్కర్ సాంగ్స్, లతా మంగేష్కర్ న్యూస్ టుడే, సచిన్ టెండూల్కర్" width="1600" height="1600" /> లతా మంగేష్కర్ | భారతరత్న, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6న కన్నుమూసారు. కొన్ని రోజులుగా కోవిడ్ కారణంగా అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. ఎన్నో వేల పాటలు పాడిన ఆ స్వరం ఇక మూగబోయిందని తెలిసి.. అభిమానులు కన్నీరు మున్నీరు అయ్యారు. (File/Photo)
పండిట్ బిర్జు మహారాజ్ | ప్రపంచ ప్రఖ్యాత కథక్ నృత్యకారుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పండిట్ బిర్జు మహారాజ్ (83) జనవరి 17న గుండెపోటుతో ఆయన మరణించారు. దేవదాస్ , దేద్ ఇష్కియా , ఉమ్రావ్ జాన్ , బాజీ రావ్ మస్తానీ వంటి అనేక బాలీవుడ్ సినిమాలకు బిర్జూ మహారాజ్ నృత్య దర్శకత్వం వహించారు. ఇది కాకుండా సత్యజిత్ రే చిత్రం ‘ చెస్ కే ఖిలాడీ’కి కూడా సంగీతం అందించారు. విశ్వరూపం చిత్రంలో ఆయన నృత్యానికి 2012 లో జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. 2016 సంవత్సరంలో బాజీరావ్ మస్తానీ రాసిన ‘ మోహే రంగ్ దో లాల్ ‘ పాటకు కొరియోగ్రఫీకి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. (File/Photo)
రమేష్ బాబు | టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మరో సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు నటుడు రమేష్ బాబు (56) జనవరి 8న అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన లివర్ సమస్యతో భాదపడుతూ తుది శ్వాస విడిచారు.సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘అగ్ని పరీక్ష’మూవీతో బాలనటుడిగా తెరంగేట్రం చేసారు. ఆ తర్వాత 2సామ్రాట్’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. (Ramesh Babu)
పి. చంద్రశేఖర్ రెడ్డి | ప్రుముఖ సినీ దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డి.. జనవరి 3 చెన్నైలో మృతి చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన పరిస్థితి విషమచిండంతో కన్నుమూసారు. తెలుగులో ఎంతోమంది దర్శకులకు ఆయన గురువు. సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు పిసి రెడ్డి. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు సహా చాలా మంది స్టార్ హీరోలతో పని చేసిన అనుభవం చంద్రశేఖర్ రెడ్డి సొంతం. అత్తా కోడళ్లు, శోభన్ బాబు మానవుడు దానవుడు, ఎన్టీఆర్ బడి పంతులు సహా చాలా సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు ఈయన. ఎక్కువగా ఆయన సూపర్ స్టార్ కృష్ణతో పని చేసారు. (P. Chandrasekhara Reddy)