ఓ భారీ సినిమా విడుదలైందంటే చాలు.. రికార్డులన్నీ చెల్లాచెదురు అయిపోతుంటాయి. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప సినిమా విషయంలో సైతం ఇదే జరుగుతుంది. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా ఒకేరోజు విడుదలైంది. పెద్దగా ప్రమోషన్ లేకుండానే హిందీ సహా మిగిలిన అన్ని భాషల్లోనూ వచ్చింది ఈ చిత్రం. అయినా సరే మంచి వసూళ్లు సాధించింది పుష్ప. హిందీలో 3.65 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అలాగే తమిళనాట కూడా 4 కోట్ల వరకు గ్రాస్ తీసుకొచ్చింది. కర్ణాటక, ఏపీ, తెలంగాణలోనూ మంచి వసూళ్లు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇండియన్ వైడ్గా 2021లో మొదటి రోజు అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా పుష్ప నయా రికార్డ్ సెట్ చేసింది. టాప్ 6లో మూడు తెలుగు సినిమాలు ఉండటం గమనార్హం.