Home » photogallery » movies »

2019 YEAREDER BOLLYWOOD HERIONS WHO INTRODUCE FIRST TIME IN TOLLYWOOD TA

2019లో విద్యా, శ్రద్ధా సహా టాలీవుడ్‌‌ను తొలిసారి పలకరించిన బీ టౌన్ భామలు..

Yearender 2019 | తెలుగు చిత్ర పరిశ్రమ ఎపుడు కొత్తతరాన్ని ఆహ్వానిస్తూ ఉంటుంది. అలాగే ఈ యేడాది కొంత మంది హీరోయిన్స్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమను తొలిసారి పలకరించారు. అందులో కొంత మంది మొదటిసారి కెమెరా ముందుకు వస్తే.. మరికొందరు ఆయా ఇండస్ట్రీస్‌లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నా తర్వాత తెలుగు తెరపై మొదటిసారి తమ అభినయంతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ భామలు తెలుగు తెరను తొలిసారి పలకరించారు. ఒకపుడు హీరోయిన్స్ ప్రాంతీయ భాషల్లో నటించడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపెట్టెవాళ్లు కాదు. కానీ ఇపుడు పరిస్థితి మారింది. మంచి స్టోరీ, తగిన పారితోషకం లభిస్తే చాలు.. పచ్చజెండా ఊపేస్తున్నారు. ఈ యేడాది బాలీవుడ్ బ్యూటీలు విద్యాబాలన్, శ్రద్ధా కపూర్‌ తొలిసారి టాలీవుడ్‌ను పలకరించారు. వీళ్లతో పాటు 2019లో టాలీవుడ్ ఇండస్ట్రీని పలకరించిన బీటౌన్ భామలెవరో చూద్దాం..