భారత జవాన్లను ఉరిలో దొంగచాటుగా చంపిన పాకిస్థాన్ ఉగ్రవాదులను వారి దేవంలో చొరబడి చావు దెబ్బతీసిన నిజ జీవిత కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘యూరీ’ ది సర్టికల్ స్ట్రైక్స్’. భారత జవాన్ల ఉసురు తీసినవాళ్లను అదేరీతిలో బదులు తీర్చుకున్నారు భారత జవానులు. రూ. 45 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఓవరాల్‌గా రూ. 350 కోట్ల వరకు రాబట్టి సంచలన విజయం సాధించింది. ఎలాంటి స్టార్ కాస్ట్ లేని ఈ సినిమా ఇలాంటి విజయం సాధించడం తక్కువేమి కాదు. అంతేకాదు ఈ సినిమాలోని నటనకు గాను విక్కీ కౌశల్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకోవడం విశేషం. (twitter/Photo)
రూ. 100 కోట్ల బడ్జెట్‌తో కంగనా నటిస్తూ దర్శకుడు క్రిష్‌తో కలిసి డైరెక్ట్ చేసిన చారిత్రక చిత్రం ‘మణికర్ణిక’. ఈ సినిమా ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర రూ.125 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ చిత్రంలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో ఒదిగిపోయింది కంగనా రనౌత్ . ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే సాధించింది. (Twitter/Photo)