2019 గూగుల్ ఇండియా టాప్ 10 చిత్రాలు.. చోటు దక్కించుకోని సాహో,సైరా..

గత కొన్నేళ్లుగా గూగుల్ ఇండియా ప్రతి యేడాది మన దేశంలో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 10 సినిమాల జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. 2019 యేడాదిగాను గూగుల్‌లో టాప్‌లో నిలిచిన చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఇందులో 7 బాలీవుడ్‌ సినిమాలు ఉండగా.. 3 హాలీవుడ్ సినిమాలున్నాయి. వీటిలో సౌత్ నుంచి ఒక్క సినిమా లేకపోవడం విచిత్రం. ఇందులో సౌత్‌లో విజయ్ దేవరకొండకు హీరోగా స్టార్ డమ్ తీసుకొచ్చిన ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ టాప్ ప్లేస్‌లో నిలిచింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. వీటిలో ఒక్క సౌత్ సినిమాకు చోటు దక్కకపోవడం కొంత విచారించదగ్గ విషయమనే చెప్పాలి.