ఆహారపు అలవాట్లు.. విటమిన్ బి 12 ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల జుట్టు తెల్లబడే సమస్యను దూరం చేసుకోవచ్చు. అదే విధంగా.. ఖచ్చితమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి. పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారమవుతుంది.
హార్మోన్స్ అసమతుల్యత.. చాలామందికి హార్మన్స్ లోపాల కారణంగా జుట్టు త్వరగా తెల్లబడుతుంది. ఇలాంటి సమస్యలున్నవారు ఆ లోపాలను సరిచేసుకునేందుకు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
ఒత్తిడి.. ప్రతీ విషయంలో టెన్షన్ పడడం వల్ల కూడా సమస్య పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఎక్కువగా ఒత్తిడికి గురైతే జుట్టు తెల్లబడుతుంది. అంతేకాదు, జుట్టు రాలుతుంది.
కాలుష్యం.. పెరిగిన పొల్యూషన్ కారణంగా జుట్టు సమస్యలు ఎక్కువవుతాయి. కాబట్టి బయటికి వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే జుట్టుని నల్లగా ఉంచే మెలనిన్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ధూమపానం, మద్యపానం కూడా జుట్టు సమస్యలపై తీవ్రప్రభావం చూపుతాయని తేలింది. 2013లో జరిగిన ఓ రీసెర్చ్‌లో మద్యం, ధూమపానం అలవాటున్నవారిలో ఎక్కువగా చిన్నవయసులోనే జుట్టు తెల్లబడడాన్ని గమనించారు.