కిడ్నీలు దెబ్బతింటున్నట్లు ముందుగానే తెలుసుకుంటే... అప్పుడు భారీ నష్టాన్ని ఆపేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. కానీ కిడ్నీలు, వాటి పనితీరు గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అవగాహనా కార్యక్రమాలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. 2006లో తొలిసారి ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరిపారు. అప్పటి నుంచి ఏటా చేస్తున్నారు.
మూత్రపిండాలు (Kidneys) మన శరీరం నుంచి వ్యర్థాలు, అదనపు ద్రవాలను తొలగిస్తాయి. మూత్రపిండాలు మన శరీరంలోని కణాలు ఉత్పత్తి చేసే యాసిడ్‌ను కూడా తొలగిస్తాయి. రక్తంలో నీరు, లవణాలు, సోడియం, కాల్షియం, భాస్వరం, పొటాషియం వంటి వాటిని సరిపడా ఉండేలా చేస్తాయి. కిడ్నీలు పనిచేయకపోతే చనిపోయే పరిస్థితి ఉంటుంది. కిడ్నీలు బాగా పనిచేయడానికి కొన్ని చిట్కాలు పాటిద్దాం.