ఆకలి రాజ్యం... ‘డిజిటల్ ఇండియా’లో దారుణ పరిస్థితులు...

‘డిజిటల్ ఇండియా’ అంటూ దేశాన్ని ప్రగతి పథంపై నడిపిస్తున్నామంటూ ఊదరగొడుతున్నారు నాయకులు. ‘అసహనం’, ‘అవినీతి’ వంటి ఆయుధాలను పట్టుకుని ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు ప్రతిపక్ష నాయకులు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉందంటే... ఆకలితో అలమటిస్తున్న దేశాల్లో భారత్ 103 ర్యాంకులో ఉంది. సోషల్ మీడియాలో ‘డిజిటల్ ఇండియా’ అంటూ పరుగులు పెడుతున్న ప్రస్తుత తరుణంలోనూ రోజుకి ప్రతీ వెయ్యిమందిలో 24 మంది పిల్లలు ఆకలితో అలమటిస్తూ చనిపోతున్నారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా రోజూ 21 మిలియన్ టన్నుల ఆహారం వృథాగా పోతోంది.