WORLD EGG DAY 2020 INTERESTING HEALTH BENEFITS WITH EGGS SU
World Egg Day: నేడు వరల్డ్ ఎగ్ డే.. ఈ విషయాలు మీకు తెలుసా?
ప్రతి ఏడాది అక్టోబర్ రెండో శుక్రవారం వరల్డ్ ఎగ్ డేని జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది ఎగ్ డే జరపాలని 1996లో జరిగిన వియన్నా సమావేవంలో ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్(ఐఈసీ) నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే నేడు(అక్టోబర్ 9) ఎగ్ డే జరుపుకుంటున్నాం.
ప్రతి ఏడాది అక్టోబర్ రెండో శుక్రవారం వరల్డ్ ఎగ్ డేని జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది ఎగ్ డే జరపాలని 1996లో జరిగిన వియన్నా సమావేవంలో ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్(ఐఈసీ) నిర్ణయం తీసుకుంది.అందులో భాగంగానే నేడు(అక్టోబర్ 9) ఎగ్ డే జరుపుకుంటున్నాం.
2/ 7
గుడ్లు తినడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటుగా, మానవ శరీరానికి పోషకాల అందించడంలో గుడ్లకు ఉన్న ప్రాధాన్యత గురించి తెలియజేయడానికే ఐఈసీ.. ఈ ఆలోచన చేసింది.
3/ 7
మనం తీసుకునే సమతుల్య ఆహారంలో గుడ్డు వినియోగాన్ని ప్రోత్సహించడానికి, గుడ్డు వినియోగాన్ని పెంచాలనే ఆలోచనతో ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ 1964లో ఏర్పాటైంది.
4/ 7
ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు వరల్డ్ ఎగ్ డేను నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని చోట్ల గుడ్లను ఉచితంగా పంపిణీ కూడా చేస్తున్నారు.
5/ 7
గుడ్డు రుచికరంగా ఉండటమే కాకుండా.. ఎన్నో పోషక విలువలున్న దివ్యమైన ఆహారం.పేదల నుంచి ధనికుల వరకు.. అందరికీ అందుబాటులో దొరికే ఈ గుడ్డు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. శరీరానికి లో కెలరీలు, నాణ్యత కలిగిన ప్రోటిన్స్ను అందజేస్తాయి.
6/ 7
బ్యాచ్లర్స్ లైఫ్లోనైతే గుడ్లది ప్రత్యేకమైన పాత్ర. చాలా మంది అతి తక్కువ సమయంలో వంట చేసుకోవడానికి, శరీరానికి పోషకాల కోసం గుడ్లపై ఆధారపడుతుంటారు.
7/ 7
బ్రేక్ ఫాస్ట్ మొదలుకుని చాలా వంటకాల్లో గుడ్లను వినియోగించడం ఇప్పుడు కామన్‌గా మారిపోయింది. కేవలం బాయిల్డ్ ఎగ్ మాత్రమే కాకుండా.. వివిధ రకాలుగా గుడ్డును వినియోగస్తున్నారు. బిర్యానీలు, ఎగ్ బొండాలు.. ఇలా రకరకాలుగా గుడ్డు రోజువారి జీవితంలో భాగమైపోయింది.