మీ అరచేతులతో ..
ఈ పరీక్షలో మీరు మీ అరచేతిలో మీ ఐదువేళ్లను మడవాలి. కాస్త, గట్టిగా పట్టుకోవాలి. ఇలా 30 సెకన్లపాటు చేసిన తర్వాత మీ చేతులను మాములు స్థితికి తీసుకురావాలి. ముందుకంటే ఇప్పుడు మీ చేతులు కాస్త తెల్లగా కనిపిస్తాయి. దీనికి కారణం మీ రక్తప్రసరణ. అరచేతిని అలాగే కాసేపు పరీక్షిస్తే.. ఆ ప్రాంతంలో కాస్త తిమ్మిరిగా ఉన్నట్లయితే, లేదా రక్తం తిరిగి ప్రయాణం చేయడానికి కొంత సమయం లేదా అంతకంటే ఎక్కువ సమయం పడితే అది ఆర్టిరియోస్క్లె రోసిస్కు సంకేతం కావచ్చు. శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సిజన్, పోషకాలను తీసుకెళ్లే రక్తనాళాల మార్పు కనిపిస్తుంది. Health checkup in 30 seconds
కాళ్లు ఎత్తడం... ఇందులో నేలపై పడుకోవాలి. చేతులు నిటారుగా పెట్టాలి. ఇప్పుడు రెండు కాళ్లు నెమ్మదిగా పైకి ఎత్తాలి. అలా మీకు వీలైనంత ఎత్తుకు ఎత్తండి. అప్పుడు మీ శరీరం, చేతులు విశ్రాంతి తీసుకున్నట్లుగా ఉండాలి. 30 సెకన్ల పాటు అలాగే ఉండాలి. మీరు 30 సెన్లపాటు అలా ఉండలేకపోతే లేదా చాలా కష్టంగా ఉన్నట్లు అయితే, పొత్తికడుపు లేదా వీపు దిగువ భాగంలో ఏదో సమస్య ఉందని అర్థం.. Health checkup in 30 seconds