Winter Weight Loss : ఎండాకాలం మనకు దాహం ఎక్కువగా వేస్తుంది. అందువల్ల వాటర్ ఎక్కువ తాగి... ఫుడ్ తక్కువ తీసుకుంటాం. శీతాకాలం అందుకు రివర్స్. ఇప్పుడు ఫుడ్ ఎక్కువగా తిని... వాటర్ తక్కువగా తాగుతాం. అందువల్ల బరువు పెరుగుతాం. బరువు పెరగడం ఈజీ... తగ్గడమే తలనొప్పి కదా. తీసుకునే ఆహారం విషయంలో కంట్రోల్ లేకపోతే కష్టమే. ఈ రోజుల్లో ఏ ఆహారం తిన్నా... ఇది మనకు మేలు చేస్తుందా, కీడు చేస్తుందా అన్నది ఓసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే బయట మనం తినే చాలా ఫుడ్డు మంచిది కాదు. మంచి ఆహారంతోనే అడ్డమైన రోగాలకూ చెక్ పెట్టగలం. పోషకాలు ఉండే ఆహారం తింటే... అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే... లేనిపోని రుగ్మతలు తప్పవు. అందుకే హెల్తీ డైట్ మెయింటేన్ చెయ్యాలి. శీతాకాలంలో పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్స్) ఉండే ఆహారం తక్కువగా తీసుకోవాలి. ఫలితంగా డయాబెటిస్ ఉంటే మేలు జరుగుతుంది. గుండెకు కూడా మంచిదే.
గ్రీన్ ఆహారం : గ్రీన్ ఆహారం ఏంటని ఆశ్చర్యపోకండి. గ్రీన్ అంటే... గ్రీన్ కలర్లో ఉండేవన్న మాట. ఆకుకూరలు, కాయగూరలు వంటివాటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువగానే ఉంటాయి. అందువల్ల శీతాకాలంలో అవి ఎక్కువగా తినాలి. ఇవి ఎంత తిన్నా... బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అంతగా పెరగవు. అందువల్ల డయాబెటిస్ ఉంటే, ఈ ఆహారం తినడం మేలు చేస్తుంది.
నట్స్ అండ్ సీడ్స్ : ఎన్నో ఏళ్ల పరిశోధనల్లో ఒక విషయం క్లియర్గా తెలుస్తోంది. పప్పులు, బద్దలు, గింజలు, తృణధాన్యాల వంటివి మనకు ఎక్కువ ఆరోగ్యాన్ని అందిస్తున్నాయి. వీటిలో వేడి ఎక్కువ. అందువల్ల వీటిని తినేవాళ్ల బాడీలో వేడి పెరుగుతుంది. ఫలితంగా... కొవ్వు కరుగుతుంది. బలమైన ఆహారం కాబట్టి ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. గుండెకు కూడా మేలే. బాదాం, వాల్నట్స్, అవిశె గింజలు, నల్ల నువ్వులు, దోసకాయ గింజల వంటివి తింటే ఫలితం కనిపిస్తుంది.
స్నాక్స్ విషయంలో : మన నోరూరించే వాటిలో స్నాక్స్ ఎప్పుడూ డేంజరస్సే. స్నాక్స్ చూడగానే చాలా మంది ఎగబడి కొనేసుకుంటారు. వాటి తయారీ కంపెనీలు కూడా... ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అంటూ ఆఫర్లు ఇస్తుంటే... ఆలోచించకుండా కొనేసుకుంటారు. కానీ ఆ స్నాక్స్ అతిగా తింటే... బరువు పెరగడమే కాదు... చెడు కొవ్వు బాడీలో తిష్టవేస్తుంది. అలాగని అసలు స్నాక్సే తినకపోవడం కూడా మంచిది కాదు. చాట్ మసాలా, క్యారట్ స్టిక్స్, బీట్ రూట్, నిమ్మరసం ఇలా రకరకాల ఆప్షన్లను ఎంచుకుంటూ... జాగ్రత్తగా డైట్ మెయింటేన్ చేస్తే... ఆ తర్వాత అతిగా వర్కవుట్స్ చెయ్యాల్సిన పని ఉండదు. అనారోగ్యాలు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లవుతుంది.