చేపలు అనగానే మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా చెరువుల్లో చేపల్నే తింటారు. నిజానికి చెరువులతోపాటూ.. సముద్ర చేపల్ని కూడా తినాలి. ఏ చేపలైనా.. బీపీని, కొలెస్ట్రాల్‌ని, డయాబెటిస్‌ని కంట్రోల్ చేస్తాయి. చేపల్లో నాణ్యమైన కొవ్వు ఎక్కువ. పుష్కలంగా ప్రోటీన్ లభిస్తుంది. వారానికి రెండుసార్లైనా చేపలను తినాలి. తద్వారా గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, డయాబెటిస్, బీపీ, మెదడు సంబంధింత సమస్యల నుంచీ బయటపడవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
మంచి కొవ్వు : చేపలు తింటే బరువు పెరుగుతామనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అది కొంతవరకూ నిజమే. నిజానికి చేపల్లో ఉండేది మంచి కొవ్వు. అది మన శరీరానికి చాలా అవసరం. చేపల్లో ఒమేగా-3 ఫ్యాట్స్ ఉంటాయి. అవి మన గుండెను హార్ట్ ఎటాక్స్ నుంచీ కాపాడతాయి. ఇక ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరంలో తయారవ్వవు. వాటిని చేపల్లాంటి వాటి ద్వారానే పొందగలం. (ప్రతీకాత్మక చిత్రం)
వ్యాధి నిరోధక శక్తి పెరగాలన్నా, కడుపులో మంటలు, వేడి తగ్గాలన్నా చేపలు తినాలి. అర్థరైటిస్ సమస్యతో బాధపడేవారికి చేపలు సరైన మందు. ఇవి నొప్పిని తగ్గించి, కండరాలకు శక్తిని ఇస్తాయి. డిప్రెషన్, అల్జీమర్స్, డైమెన్షియా, మతిమరపు లాంటి లక్షణాల్ని చేపలు తగ్గిస్తాయి. సాల్మన్, సార్డిన్స్, మాకెరెల్, ట్రౌట్, హెర్రింగ్, ట్యూనా చేపలు తింటే ఎక్కువ ప్రయోజనాలుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
చేపల్లోని పొటాషియం.. శరీరంలో ద్రవాలకు చాలా అవసరమైన పోషకం. కణాలు సమర్థంగా పనిచెయ్యడానికి పొటాషియం కావాలి. పొటాషియం తగ్గితే.. హైబీపీ వస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఎముకలు పగలగలవు. యూరిన్‌లో కాల్షియం బయటకు వెళ్లిపోతుంది. అందువల్ల పొటాషియం బాగా ఉండే చేపలు తినాలి. (ప్రతీకాత్మక చిత్రం)