పాలకూర..
మెంతులు, పాలకూరలో విటమిన్ ఏ,సీ, కే పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ కే చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి మృదువుగా చేస్తుంది. అలాగే మొటిమలు తగ్గిస్తుంది. మచ్చలను నయం చేయ డంలో కూడా సహకరిస్తుంది. పాలకూరలో ప్రోటీన్లు, ఐరన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి, జుట్టు, శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి.
స్పైసెస్, హెర్బ్స్..
భారతీయ ఆహారంలో ఇతర దేశపు ఆహారం కంటే ఎక్కువ మసాలాలు ఉంటాయి. ముఖ్యంగా అల్లం, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, నల్ల మిరియాలు, వెల్లుల్లి మొదలైనవి చలికాలంలో వెచ్చగా ఉండటానికి సహాయపడతాయి. కాబట్టి టీలో లవంగాలు, యాలకులు వేసుకుని తాగితే శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌ను తగ్గిస్తాయి. ఇది రక్తప్రసరణ, శారీరక శ్రమను సక్రమంగా ఉంచడం ద్వారా జుట్టు బాగా పెరగడానికి సహాయపడుతుంది. యాంటీ ఇన్ఫెక్టివ్, యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి మీ చర్మాన్ని సురక్షితంగా చూసుకుంటాయి.
సిట్రస్ ఫ్రూట్స్..
విటమిన్ సీ పుష్కలంగా ఉండే సిట్రస్ పండ్లను చలికాలంలో తింటే చర్మం కాంతివంతంగా మారుతుంది. ప్రధానంగా నిమ్మ కాయు, నారింజలను తినాలి. బంగాళదుంప తురిమి రసం పిండాలి. లేదంటే ఇందులోని పీచు పదార్థాలు శరీరంలోకి వెళ్లవు. సిట్రస్ పండ్లు స్కిన్ ఇన్ఫెక్షన్స్ను నివారిస్తుంది. మీ చర్మాన్ని ఎప్పటికీ యవ్వనంగా ఉంచుతుంది.
డ్రైఫ్రూట్స్..
మంచి కొలెస్ట్రాల్ ఐరన్, ప్రొటీన్, కాల్షియం, విటమిన్లు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి మంచి పోషకాలు ఎక్కువగా ఉండే బాదం, ఖర్జూరం,ఎండు అత్తిపండ్లు, వాల్నట్స్ చలికాలంలో తినవచ్చు. దీంతో చర్మకాంతి పెరుగుతుంది. ఇది వెంటుకలను దట్టంగా మారుస్తుంది. సూర్యకిరణాల నుంచి కాపాడుతుంది. చర్మం లోపలికి పోషణను అందిస్తుంది.
తృణధాన్యాలు..
చలికాలంలో రాగులు, వరి, మొక్కజొన్న వంటి ధాన్యాలు తీసుకోవాలి. ఇందులో ప్రోటీన్లు, కాల్షియం, ఫైబర్లు అధికంగా ఉంటాయి. ఇలాంటి తృణధాన్యాలు శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. చర్మం పొడిబారడం వల్ల వచ్చే సమస్యలను కూడా ఇది మాయిశ్చరైజ్ చేస్తుంది. ఈ ఆహారాలు తింటే మీ చర్మం కచ్చితంగా కాంతివంతంగా మారుతుంది.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )