అరటిలో పిండి పదార్థం ఎక్కువ. బరువును కంట్రోల్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. సరిపడా బరువు ఉండేలా చేస్తుంది. అరటిలోని పీచు పదార్థం మరింత ఆకలి వెయ్యకుండా చేస్తుంది. మైక్రోబయోటిక్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ ప్రాక్టీషనర్ శిల్ప అరోరా ప్రకారం, అరటిరలోని పీచు పదార్థాలు, బరువు తగ్గేందుకు సహాయపడతాయి. శరీరంలో వివిధ విభాగాలు చక్కగా పనిచేసేలా చేస్తాయి.
అందువల్ల బరువు సంగతి మర్చిపోయి, అరటిపండ్లు తినాలంటున్నారు ఆరోగ్య రంగ నిపుణులు. కొంతమంది అరటిపండ్లను ఇతర పదార్థాలతో కలిపి తీసుకుంటారు. అలాంటి వాళ్ల, అరటితోపాటూ ఓట్స్ కలిపి తీసుకోవచ్చని సూచిస్తున్నారు. ఐతే డాక్టర్లు సూచిస్తున్నా, అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతున్నామని భావించేవాళ్లు, డైట్ విషయంలో డాక్టర్ను సంప్రదించడం మేలు.