First Night: మన దేశంలో ప్రతీ దానికీ సంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలూ, విధానాలుంటాయి. పెళ్లి చూపులు, పెళ్లి ఆ తర్వాత శోభనం... ఇవన్నీ ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు పెద్దలు. అందుకే మన దేశంలో సంప్రదాయాలంటే విదేశీయులు ఎంతో ఇష్టపడతారు. వాటిని తెలుసుకోవడానికి విదేశాల నుంచి వస్తుంటారు. (image credit - youtube)
జనరల్‌గా ఫస్ట్ నైట్ సమయంలో... వధూవరులు భోజనం చేసి... గదిలోకి వెళ్తారు. వధువు పాల గ్లాస్ (milk glass) ఇవ్వడం... వరుడు సగం తాగి... వధువుకి ఇవ్వడం... ఆ సగం పాలను ఆమె తాగడం ఇదంతా సంప్రదాయం. ఆ పాలను సగం సగం పంచుకున్నట్లే... జీవితాంతం ప్రతి అంశాన్ని పంచుకుంటూ ముందుకు సాగాలన్నది అందులో పరమార్థం. (image credit - youtube)
ఇక్కడ వరకూ అంతా ఓకే... ఆ పక్కన టేబుల్‌పై పెద్దోళ్లు పండ్లు, స్వీట్లు ఉంచుతారు. చాలా మంది పాల కంటే ఆ స్వీట్లపై ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే... అల్లుడికి నచ్చాలనే ఉద్దేశంతో హైక్వాలిటీ స్వీ్ట్లు (sweets) తయారుచేస్తారు. వాటి నుంచి నెయ్యి (ghee) వాసన అలా అలా వచ్చి నోరూరిస్తూ ఉంటుంది. దాంతో వధూవరులు సహజంగానే స్వీట్లు తినేందుకు రెడీ అవుతారు. అక్కడే అసలు సమస్య ఉంది. (image credit - youtube)
స్వీట్లు తింటే నిద్ర రావడం ఖాయం. పాలు తాగినా నిద్ర వస్తుంది. కాకపోతే... పాలలో స్వీట్ మరీ ఎక్కువగా ఉండదు. అదే స్వీట్లలో అయితే... పంచదారో, బెల్లమో బాగా ఉంటుంది. కాబట్టి... అవి తింటే... నిద్రమత్తు (drowsiness) మామూలుగా రాదు. మైండ్ మొత్తం మత్తుగా మారుతుంది. స్వీట్లు తిన్న పావు గంటలో నిద్ర వస్తుంది. అంతే... ఇక శోభనమూ లేదు ఏమీ లేదు... ఉండేదల్లా నిద్రే.
స్వీట్ తింటే... అందులోని తీపి వల్లే నిద్ర వస్తుందన్నది సైంటిఫిక్‌గా తేలిన అంశం. ఇలా ఎందుకు జరుగుతుందంటే... షుగర్ అనేది ఒక రకమైన మత్తు పదార్థం లాంటిదే. స్వీట్ తిన్న కాసేపటికి ఎనర్జీ వచ్చినట్లు భావిస్తాం గానీ... ఆ తర్వాత అది మెదడును మొద్దుబారేలా చేస్తుంది. ఒళ్లంతా బద్దకం వచ్చేలా చేస్తుంది. అలసట వచ్చినట్లు అయిపోతారు. క్రమంగా నిద్ర కమ్ముకొస్తుంది. అలా నిద్రలోకి జారుకుంటే... మంచి నిద్ర పడుతుంది. ఇక లేవబుద్ధి కాదు. శోభనం కూడా వాయిదా పడేలా చెయ్యగలదు చక్కెర.
పంచదార తిన్నాక... ఒరెక్సిన్ (Orexin) అనేది మెదడులో రిలీజ్ అవుతుంది. ఇదో రకమైన రసాయనం. ఇది మెదడును మొద్దుబారేలా చేస్తుంది. చురుకుదనం పోగొడుతుంది. అందుకే స్వీట్స్ తిన్న వారికి నిద్ర వస్తుంది. కాబట్టి శోభనం బాగా జరగాలి... కుమ్మేయాలి అనుకునేవారు... ఆ మూడు రోజులూ స్వీట్లకు దూరంగా ఉండటం బెటర్ అంటున్నారు పరిశోధకులు. ఆ తర్వాత మీ ఇష్టం.