జెర్రి... ఈ మాట వినగానే...మన మనసులో ఓ వికృతాకార జీవి మెదులుతుంది. వెంటనే భయం వేస్తుంది. తలచుకుంటేనే అలా భయపడే మనం... నిజంగా జర్రి మన దగ్గరకు వస్తే... ఇక ఆగం. వెంటనే చెప్పు తీసుకొని చంపేస్తాం. ఎందుకంటే విషపూరితమైన ఆ ప్రాణి మనల్ని కుడుతుందేమో అనే టెన్షన్. కానీ జెర్రులు మనుషుల్ని కుట్టే సందర్భాలు చాలా తక్కువ. (image credit - youtube)
జెర్రి కుడితే ప్రాణాలు పోవు. నొప్పి మాత్రమే ఉంటుంది. దాని విషాన్ని తట్టుకునే శక్తి మనకు ఉంటుంది. సాధారణంగా జెర్రులు రాళ్ల కింద ఉంటాయి. వానాకాలంలో రాళ్ల కిందకు నీరు రాగానే... అక్కడ ఉండలేక... వేరే ప్రదేశం వెతుక్కుంటాయి. అలాంటి సందర్భంలో అవి ఇళ్లలోకి వస్తాయి. అలా వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా బయటకు పంపాలే గానీ చంపకూడదు అంటున్నారు పరిశోధకులు. (ప్రతీకాత్మక చిత్రం)
జెర్రి ఇంట్లోకి వస్తే అది మంచిదే అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే... జెర్రులు... బొద్దింకలు, పురుగులు, కీటకాలు, ఈగలు, దోమలు, నల్లులు వంటి మనకు హాని చేసే ప్రాణుల్ని ఆహారంగా తీసుకుంటాయట. అందువల్ల జెర్రి ఇంట్లో ఉన్నా ఏమీ కాదంటున్నారు. కాకపోతే... షూస్, చెప్పుల వంటి వాటిలో, చీకటి ప్రదేశాల్లో జెర్రులు దాక్కుంటాయనీ... అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇవన్నీ మనం ఆలోచించం. జెర్రి రాగానే భయంతో చంపేస్తాం. అలా జెర్రిని చంపడం వల్ల మనకు ఎలాంటి లాభమూ ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. జెర్రుల వల్ల మనుషులకు ఎలాంటి వ్యాధులూ రావనీ... అలాంటప్పుడు... వాటిని చంపడం ఎంతవరకూ కరెక్టో ఆలోచించుకోవాలి అంటున్నారు. ఈ భూమిపై మిగతా ప్రాణుల లాగే... జెర్రుల వల్ల కూడా మనకు ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి... వాటిని చంపకుండా బయట వదిలేయమని కోరుతున్నారు. విదేశాల్లో జెర్రులను పెంచుకునే వారూ ఉన్నారు. (image credit - youtube)
జెర్రి కుట్టినప్పుడు నొప్పిని ఓర్చుకోవాలి. గోరు వెచ్చటి నీటితో కుట్టిన ప్రదేశాన్ని కడగాలి. ఐస్ ముక్కలను గాయంపై ఉంచవచ్చు. రాన్రానూ పరిస్థితి తీవ్రం అయితే... రెండు మూడు రోజులైనా నొప్పి తగ్గకపోతే... అప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. 1932లో మాత్రమే జెర్రి కుట్టినప్పుడు ఓ మరణం సంభవించింది. ఇంకెప్పుడూ అలా జరగలేదు. (image credit - youtube)