మధుమేహం (Diabetes). అంత ప్రమాదకరం కాకపోయినా.. దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడతాయి. శారీరక శ్రమ పూర్తిగా లోపించడం, గంటల తరబడి కూర్చోని ఉండటం, పోషక పదార్థాలు సరిగా లేని ఆహారం, వేపుడు కూరలు, అధికంగా కొవ్వు ఉండే పదార్థాలు, మాంసాహారం, బేకరీ పదార్థాలు, నిల్వ ఉండే పచ్చళ్లు, తీపి పదార్థాలు, కొన్ని రకాల మందుల దుష్ఫరిణామాలు ఈ వ్యాధికి (disease) కారణం.
స్టెరాయిడ్స్, కొన్ని రకాల వైరస్, ఇన్ఫెక్షన్స్, హార్మోన్ల అసమతుల్యత వల్ల మధుమేహం (Diabetes) వస్తుంటుంది. తరచుగా మూత్ర విసర్జన (పాలీయూరియా), పొడి గొంతు లేదా తరచుగా దాహం వెయ్యడం (పాలీడిప్సియా), కంటి చూపు(eye site) మందగించడం., కారణం లేకుండా ఆకస్మిక బరువు పెరుగుట లేదా బరువు తగ్గడం (weight loss), ఒక్కసారిగా నీరసం అలసటగా అనిపించడం అధికంగా ఆకలి వేయడం (Hungry) దీని ముఖ్య లక్షణాలు. (ప్రతీకాత్మక చిత్రం)
వాకింగ్ (walking) చేస్తే డయాబెటిస్ అదుపులో పెట్టవచ్చు. రాత్రిపూట భోజనం తర్వాత వాకింగ్ చేసిన వారిలో ఏకంగా 22 శాతం వరకు షుగర్ లెవెల్స్ తగ్గినట్లు పరిశోధకులు వివరించారు. ఇలా వాకింగ్ చేస్తే మధుమేహం సమస్య దరిచేరదని చెబుతున్నారు. శరీరానికి మానసిక, శారీరక ఉల్లాసం దొరుకుతుందట. వారి పనితీరు సైతం మెరుగైనట్లు ఆ రిపోర్టులో తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)