మన ఆహారపు అలవాట్లకు (Food Habits) , ఆరోగ్యానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా పిల్లలు సరైన ఆహారపు అలవాట్లు (Children food habits) పాటించకపోతే భవిష్యత్తులో అనర్థాలు ఎదురవుతాయి. ఈ విషయాన్ని మరో పరిశోధన సైతం నిర్ధారించింది. ఎన్విరాన్మెంటల్ జర్నల్ ఆఫ్ హెల్త్ (journal environmental health) అనే మ్యాగజైన్లో ప్రచురితమైన ఈ అధ్యయనాన్ని పిల్లల ఆహారపు అలవాట్లపై నిర్వహించారు. ప్రపంచంలోని అనేక పెద్ద యూనివర్సిటీలు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నాయి.
టీవీ, ల్యాప్టాప్ లేదా చూస్తూ ఆహారం (Watching TV, Mobile while having food) తినే పిల్లలు అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధన తేల్చింది. ఇలాంటివారు పెద్దయ్యాక చిన్న విషయాలకే ఎక్కువగా రియాక్ట్ అవుతూ అసంతృప్తికి లోనవుతారని గుర్తించింది. ఆ అధ్యయనం ఫలితాలను బయోమెడ్ సెంట్రల్ జర్నల్లో (Biomed central journal) ప్రచురించారు.
ఈ లెక్కన చూస్తే.. 2030 నాటికి దేశంలోని దాదాపు సగం మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడవచ్చు. గత 50 ఏళ్లలో.. భారత్లో పిల్లలకు అందించే నూనె ఉత్పత్తుల వినియోగం 20 శాతం పెరిగిందని కొన్ని సర్వేలు తేల్చాయి. మిఠాయి, చాక్లెట్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, స్వీట్లు తినేవారిలో దాదాపు 80 శాతం మంది 11- 20 సంవత్సరాల మధ్య వయసు పిల్లలు ఉన్నట్లు ఆ సర్వే నివేదించింది.
ఒక సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ‘జీరో స్క్రీన్ టైమ్’ను సంస్థ నిర్దేశించింది. అంటే వారిని పూర్తిగా గాడ్జెట్లకు దూరంగా ఉంచాలని అర్థం. 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకు స్క్రీన్ టైమ్ రోజుకు ఒక గంట మించకూడదు. 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలకు ఒక రోజులో గరిష్టంగా ఒక గంట స్క్రీన్ టైమ్ను WHO నిర్దేశించింది.