తెల్లగా, చిన్నగా ఉండే గసగసాల్ని ఈ రోజుల్లో మనం వంటల్లో వాడుతున్నాంగానీ... పూర్వం వాటిని మందుల తయారీలో వాడేవాళ్లు. మిగతా సుగంధ ద్రవ్యాలలాగే గసగసాలు కూడా చాలా ముఖ్యమైనవి. వాటితో కలిగే ప్రయోజనాలు తెలియక చాలా మంది... మిగతా మసాలా ఐటెమ్స్ కొనుక్కుంటారు కానీ, గసగసాల్ని కొనేందుకు అంతగా ఇష్టపడరు. ఇప్పుడవి కొనకపోతే, కూర టేస్ట్ మారిపోతుందా అని అనుకుంటారు.
ఐతే... గసగసాలు కూరలకు ఎంతో టేస్ట్ ఇస్తాయి. కుర్మా లాంటి వాటిలో గసగసాల్ని వేయడం ద్వారా ప్రత్యేక రుచి, కమ్మదనం వస్తుంది. ఈ రోజుల్లో ప్రతీదీ పొడుల రూపంలో వచ్చేస్తున్నా, చిన్నగా ఉండే గసగసాలు మాత్రం పొడిలా కాకుండా అవి ఎలా ఉన్నాయో, అలాగే ప్యాకింగ్‌లో దొరుకుతున్నాయి. మరి గసగసాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.