Weight loss Tips: సాధారణంగా ప్రతి వంట గదిలో ఉండేవాటిలో వెల్లుల్లి ఒకటి.. ఎందుకంటే వంటల్లో రుచి, సువాసన కోసం వెల్లుల్లిని వేస్తూ ఉంటారు. కారణం ఏదైనా వెల్లుల్లి వాడడం ఎంతో శ్రేయస్కరం. ఎందుకంటే వెల్లుల్లిలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వెల్లుల్లి బరువు తగ్గించటానికి సహాయపడుతుందని మీకు తెలుసా..?
వెల్లుల్లిలో విటమిన్ బి 6, విటమిన్ సి , ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. అందుకే ఇవి మనిషి బరువు తగ్గించటంలో కీలక పాత్రను పోషిస్తాయి. ప్రతి రోజు కొన్ని వెల్లుల్లి రేకలను తింటే జిమ్ కి వెళ్లకుండానే బరువు సులువుగా తగ్గవచ్చు. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వటమే కాకుండా ఎక్కువ కేలరీలు ఖర్చు అయ్యేలా చేస్తుంది.
జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రొసెస్ చేయడమే కాదు. అనవసరమైన కొవ్వును శరీరం నుంచి బయటకు పంపిచేయటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అంతే కాదు వెల్లుల్లిని తింటే ఆకలి వేయదు. వెల్లుల్లి అడ్రినలైన్ని ఎక్కువ మొత్తంలో విడుదల చేయడం ద్వారా నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేసి క్యాలరీలను కరిగించటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.
వెల్లుల్లిలో అలిసిన్ ఉంటుంది. ఇది కొవ్వును అత్యంత వేగంగా కరిగించటానికి ఉపయోగపడుతుంది. వెల్లుల్లి రేకలను పై తొక్కలు తీసేసి పాన్ లో నూనె లేకుండా వేగించాలి. వీటిని ప్రతి రోజు ఉదయం పరగడుపున తినాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటూ చేస్తే ఆ మార్పు మీకు స్పష్టంగా కనపడుతుంది. అయితే రోజుకి రెండు లేదా మూడు వెల్లుల్లి రేకలను మాత్రమే తినాలి.
వెల్లుల్లి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి.. ఈ జాగ్రత్తలు తీసుకోకుండా ప్రమాదం కూడా అంతే.. ఎందుకంటే ఎక్కువగా తింటే సైడ్ ఎఫెక్ట్స్వచ్చే అవకాశం ఉంది. ప్రతి రోజు వెల్లుల్లిని ఇలా తీసుకోవటం వలన బరువు తగ్గటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కీళ్ల నొప్పులు, గుండె సమస్యలు, అల్జీమర్స్ వంటివి ఏమి రాకుండా ఉంటాయి.
అదే క్రమంలో వెల్లుల్లిలో సల్ఫర్ ఎక్కువగా ఉన్నందున చిన్న పిల్లలకు తాక్కువ మోతాదులో వాడాలి. ఎక్కువైతే గాబరా పడతారు వెల్లుల్లి గాటుగా ఉంటుంది.. కొత్నమందికి కడుపులో మంట పుడుతుంది. వెల్లుల్లి కొంతమందికి పడదు.. ఎలర్జీ వస్తుంది, దురదలు, తలనొప్పి, ఆయాసం వస్తాయి. వీళ్ళు వెల్లుల్లి తినరాదు. ఆస్తమా ఉన్నవారు వెల్లుల్లి అస్సలు వాడకూడదు.