ఎగ్స్ అనేవి కంప్లీట్ ఫుడ్. వాటిలో విటమిన్లు, మినలర్స్, మన శరీరానికి అవసరమైన అన్ని పోటీన్స్ వాటిలో ఉంటాయి. అందుకే ప్రపంచమంతా ఎగ్స్ వాడుతున్నారు. ప్రస్తుతం గుడ్లను... బేకింగ్ ఆహారంలో, సలాడ్లలో కూడా వాడుతున్నారు. కర్రీస్, నూడుల్స్, బ్రోత్స్తోపాటూ వండుతున్నారు. విడిగా కూడా తింటున్నారు. రోజూ రెండు గుడ్లను తింటే... ఆరోగ్యానికి ఎంతో మేలు.
గుడ్ల సైజు విషయంలో తెల్లవి కాస్త పెద్దగా, బ్రౌన్వి కాస్త చిన్నగా ఉంటాయి. గుడ్లు పెట్టే కోళ్లు పెద్దవి అయితే... గుడ్లు పెద్దవిగా ఉంటాయి... కోళ్లు చిన్నవైతే... గుడ్లు కూడా చిన్నగా ఉంటాయి. వేసవి కాలంలో పెట్టే గుడ్లు చిన్నవిగా, చలికాలంలో పెట్టే గుడ్లు పెద్దవిగా ఉంటాయి. అవి ఏ రంగువైనా ఇలాగే జరుగుతుంది.