ఈ రెండింటి మధ్య తేడాలు...? గ్రీన్ ఆపిల్ లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ మరియు విటమిన్ కె ఉన్నాయి. దీనిలో రెడ్ యాపిల్ కంటే ఎక్కువ ఇనుము, పొటాషియం, ప్రోటీన్ ఉంటుంది. చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఎవరైనా యాపిల్ తినాలనుకుంటే, రెడ్ యాపిల్ కంటే గ్రీన్ యాపిల్ తినడం మంచిది. మరోవైపు రెడ్ యాపిల్ లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు అవసరమయ్యే వారు రెడ్ యాపిల్ తినడం మంచిది.