Sagu : ఉపవాస సగ్గుబియ్యం ఎక్కడ, ఎలా పెరుగుతుందో తెలుసా?
Sagu : ఉపవాస సగ్గుబియ్యం ఎక్కడ, ఎలా పెరుగుతుందో తెలుసా?
Sagu : భారతదేశంలో పూజలు ఎక్కువగా చేస్తారు. చాలా మంది ఉపవాసం చేస్తారు. ఉపవాస సమయంలో లేదా.. ఉపవాసం తర్వాత సగ్గుబియ్యం తీసుకుంటారు. మరి ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? ఎలా పెరుగుతాయి? తెలుసుకుందాం.
విదేశాల్లో చాలా తక్కువగా.. భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే వాటిలో సగ్గుబియ్యం ప్రత్యేకం. వీటిని బాగా నానబెట్టి... తర్వాత పాలలో ఉడికించి.. సూప్ లాగా తీసుకుంటారు. సగ్గుబియ్యం భారతీయ జీవన విధానంలో భాగంగా ఉంది.
2/ 10
ఈ సగ్గుబియ్యం ఎలా తయారవుతుందో చాలా మందికి తెలియదు. నిజానికి ఇదో సుదీర్ఘ ప్రక్రియ.
3/ 10
సగ్గుబియ్యం ఇండియా, దక్షిణ ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియా దేశాలైన ఇండొనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, పపువా న్యూ గినియాలో కనిపించే ప్రత్యేక తాటి చెట్ల పిండి నుంచి తయారవుతుంది.
4/ 10
ఈ సగ్గుబియ్యం చెట్టును మెట్రోజిలాన్ సాగు (Metroxylon sagu) అని అంటారు. ఈ చెట్టు వేర్లకు ఉండే దుంపలను సేకరిస్తారు. ఇవి చిలకడ దుంపల లాగా ఉంటాయి. బ్రౌన్ కలర్లో ఉంటాయి. (image credit - youtube - Wanted TV)
5/ 10
ఆ దుంపలను ఒక యంత్రంలో వేసి బాగా కడుగుతారు. తర్వాత దుంపల పై తొక్కను యంత్రాల ద్వారా తొలగిస్తారు. కొన్ని సాగూ కర్మాగారాల్లో ఈ తొక్కను తొలగించే పనిని వర్కర్లు చేతులతోనే చేస్తున్నారు.
6/ 10
తొక్క తీసేసిన దుంపలను మళ్లీ నీటితో కడిగి.. పొడిలా చేస్తారు. ఈ సమయంలో వాటిలోని రసం బయటకుపోతుంది. తెల్లటి పిండి వస్తుంది. ఐతే.. ఈ పిండిలో స్టార్చ్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని తొలగించేందుకు మరోసారి నీటితో రిఫైండ్ చేస్తారు.`
7/ 10
రిఫైండ్ చేసినప్పుడు తెల్లని పిండి పదార్థం మిగులుతుంది. దాన్ని ఎండబెడతారు. అలా ఎండబెట్టినప్పుడు అది పెద్ద పెద్ద గడ్డలుగా మారిపోతుంది.
8/ 10
ఆ తెల్లని గడ్డలను మళ్లీ యంత్రాలలో వేసి.. పొడిలా చేస్తారు.
9/ 10
ఈ పొడిని సగ్గు బియ్యం ఆకారంలో మార్చడానికి ప్రత్యేక యంత్రం ఉంటుంది. దాని ద్వారా సగ్గుబియ్యాన్ని చిన్న చిన్న గోళాకారాల్లో తయారుచేస్తారు. (image credit - youtube - Wanted TV)
10/ 10
ఇలా తయారయ్యే సగ్గుబియ్యాన్ని మన భారతీయులు ఉపయోగిస్తారు. ఇందులోని అధిక పిండి పదార్ధం.. ఉపవాస సమయంలో శరీరానికి వెంటనే శక్తిని ఇస్తుంది.