దేశంలో గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో క్రమంగా పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా.. చిన్నవయసులోనే చాలా మంది ప్రాణాలు కోల్పతున్నారు. ఒక వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి, అతని పల్స్ పడిపోతుంటే, గుండెపోటు లేదా ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ సంభవించినట్లు అర్థం. Image source shutterstock
ఒక వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకున్నప్పుడు మొదట రెండు చేతులతో అతని ఛాతీని నొక్కాలి. ఈ సమయంలో మీ అరచేతి దిగువ భాగం ఛాతీపై ఉండాలి. ఆపై ఒత్తిడి చేయాలి. దీంతోపాటు రోగికి నోటి ద్వారా శ్వాస అందించవచ్చు. ఇలా చేసిన వెంటనే రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. దీనివల్ల రోగి బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. Image source Gettyimage
గుండెపోటు వచ్చిన వ్యక్తి శ్వాస తీసుకుంటున్నాడా లేదా అని తెలుసుకునేందుకు ముందు అతని ఛాతిని గమనించాలి.తర్వాత అతనికి దగ్గరగా తల పెట్టి శ్వాస తీస్తున్నాడా లేదా చూడాలి. ఒకవేళ అతను శ్వాస తీసుకోకపోతే తక్షణం అంబులెన్స్‌కి ఫోన్ చేయాలి. ఆ తర్వాత వెంటనే సీపీఆర్ ప్రారంభించాలి. Photo by Michel E on Unsplash