కాఫీ జాతికి చెందిన ఓ చెట్టుకు కాసే పండు ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఈ పండు మామూలు పండు కాదు. ఫుల్లుగా ఔషధ గుణాలున్న పండు. అందుకే ఈ పండుతో జ్యూస్ తయారుచేసి.. ఆన్లైన్ ఈ-కామర్స్ సైట్లలో అమ్ముతున్నారు. 1 కేజీ జ్యూస్ దాదాపు రూ.200 ఉంటోంది. ఆ జ్యూస్ని ప్రజలు తెగ కొంటున్నారు. అంతలా ఏం ఉంది అందులో? (image credit - https://www.amazon.in/omkar-india-NONI-JUICE-1KG/dp/B09X5DBX7M)
నోనీ పండ్ల మొక్కలు 18 నెలల్లో చెట్లు అవుతాయి. ఆ తర్వాత ప్రతి నెలా 4 నుంచి 8 కేజీల పండ్లను ఇస్తాయి. ఈ చెట్లు 30 అడుగుల ఎత్తు పెరుగుతాయి. వీటి ఆకులు ముదురు గ్రీన్ కలర్లో ఉంటాయి. ఈ చెట్లకు ఏడాదంతా పూలు, కాయలు కాస్తూనే ఉంటాయి. ఈ కాయ మొదట గ్రీన్ కలర్లో ఉంటుంది. తర్వాత పసుపు, పండినప్పుడు తెలుపు రంగులోకి మారుతుంది. కాయలో గింజలు ఎక్కువగానే ఉంటాయి.
ఈ పండ్లను ప్రస్తుతం జ్యూస్ డ్రింక్స్, పౌడర్స్, లోషన్స్, సోప్స్, ఆయిల్స్, మందుల్లో ఉపయోగిస్తున్నారు. ఐతే.. ఈ పండ్లను తినవచ్చు కూడా. గిరిజనులు వీటిని తింటారు. కాకపోతే.. వీటి ఘాటు వాసన వల్ల.. చాలా మంది వీటిని ఇప్పుడు తినట్లేదు. ఆన్లైన్లో జ్యూస్ల అమ్మకాలు జోరుగా ఉన్నాయి. తాజాగా రంగుల (dyes) తయారీలో కూడా ఈ పండ్లను వాడుతున్నారు. (image credit - https://www.amazon.in/omkar-india-NONI-JUICE-1KG/dp/B09X5DBX7M)
ఈ పండ్లలో డైటరీ ఫైబర్, కార్బోహైడ్రేట్స్, మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. అలాగే... విటమిన్ సీ, నియాసిన్ (విటమిన్ B3), పొటాషియం, విటమిన్ A, కాల్షియం, సోడియం ఉంటాయి. ఇంకా ఫైటోకెమికల్స్ అయిన లిగ్నాన్స్, ఒలిగో ఉంటాయి. వీటితోపాటూ పాలీశాచరైడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఇరిడాయిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, స్కోపోలెటిన్, కాటెచిన్, బీటా-సిటోస్టెరాల్, డామ్నాకాంథల్, ఆల్కలాయిడ్స్ ఉంటాయి.
ఈ పండు ఇమ్యూనిటీని పెంచుతుంది. వేడి తగ్గించి, చలవ చేస్తుంది. కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి... అధిక బరువు తగ్గేలా చేస్తుంది. తద్వారా గుండెకు మేలు జరుగుతుంది. చర్మాన్ని కాపాడుతుంది. ముడతలు రాకుండా చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై లోతైన పరిశోధనలు జరుగుతున్నాయి. (image credit - https://www.amazon.in/omkar-india-NONI-JUICE-1KG/dp/B09X5DBX7M)