Heart Attack : మన శరీరం బయట ఉండే అవయవాలకు ఏదైనా తేడా వస్తే.. మనం ఇట్టే కనిపెట్టి.. జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ శరీరం లోపల ఉండే అవయవాలకు ఏమవుతుందో, ఎలా ఉన్నాయో తెలియదు. వాటికి ఏమైనా అయితే.. లక్షల రూపాయలు వదిలిపోతాయి. ఒక్కోసారి ఎంత డబ్బు ఖర్చైనా ప్రాణాలు దక్కవు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే.. మనం మంచి ఆహారం తీసుకోవాలి. మైదా, పామాయిల్, మద్యానికి దూరంగా ఉండాలి. అలాగే... ఆరోగ్య అవగాహన పెంచుకోవాలి. తద్వారా గుండె జబ్బులు (Heart Disease) రాకుండా చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
సినిమాల్లో హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి గిలగిలా కొట్టుకుంటుంటే.. ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు చూపిస్తారు. గుండెకు రక్త సరఫరాలో తేడా వస్తే.. అది హార్ట్ ఎటాక్ అవుతుంది. అలా జరిగినప్పుడు.. 6 గంటలపాటూ బతికే అవకాశాలు ఉంటాయి. ఇలా కాకుండా.. డైరెక్టుగా గుండెలోనే తేడా వస్తే.. వెంటనే చనిపోతారు. దీన్ని కార్డియాక్ అరెస్ట్ (cardiac arrest) అంటారు. ఇది వస్తున్న విషయం కూడా తెలియదు. వచ్చిన ఒకట్రెండు సెకండ్లకే చనిపోతారు. ఇవి రెండూ కాకుండా మరొకటి ఉంది. అదే సైలెంట్ హార్ట్ ఎటాక్. అసలైన హార్ట్ ఎటాక్ వచ్చే ముందు సైలెంట్ హార్ట్ ఎటాక్ (silent heart attack) వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వస్తున్న హార్ట్ ఎటాక్స్‌లో 45 శాతం వాటికి ముందుగా సైలెంట్ హార్ట్ ఎటాక్ వస్తోంది. స్త్రీల కంటే పురుషులకే ఇది ఎక్కువగా వస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
సైలెంట్ హార్ట్ ఎటాక్స్ని మెడికల్ భాషలో సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ (silent myocardial infarction (SMI)) అంటారు. ఈ సైలెంట్ హార్ట్ సమస్య ఏదో ఒక సమయంలో వస్తుంది. ఛాతీ దగ్గర నొప్పి వచ్చినట్లు అనిపిస్తుంది. అది తాత్కాలికంగా వచ్చి పోతుంది. దాంతో ఏం కాదులే అనుకుంటారు చాలా మంది. దాన్ని నిర్లక్ష్యం చేయడంతో... ఆ తర్వాత ఏదో ఒక రోజు అసలైన హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోతుంటారు. సగం కేసుల్లో ఇలాగే జరుగుతోంది. సరైన సమయానికి గుండెను పట్టించుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
సైలెంట్ హార్ట్ లక్షణాలు : సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు చెస్ట్ దగ్గర భారీగా నొప్పి రాదు. చిన్నగా వస్తుంది. చెయ్యి, మెడ, దవడ దగ్గర చిన్నగా నొప్పి వస్తుంది. కళ్లు మసకబారతాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అది సైలెంట్ హార్ట్ ఎటాక్ కావచ్చు. చాలా మంది ఈ లక్షణాలు... గుండె సంబంధిత సమస్యవి అని గుర్తించలేరు. తెలియక నిర్లక్ష్యం చేస్తారు. అందువల్ల కొన్నాళ్లకు అసలైన గుండె నొప్పి వచ్చి చనిపోతుంటారు. మీకు సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చిందా లేదా అనేది ఈ లక్షణాల (Symptoms of a silent heart attack)తో గుర్తించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. Discomfort in body parts: రాబోయే హార్ట్ ఎటాక్ లక్షణాలు శరీరంలోని కొన్ని అవయవాలపై కనిపిస్తాయి. రొమ్ము దగ్గర నొప్పితోపాటూ... చేతులు, వెన్నెముక, మెడ, దవడ, పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది. ఈ లక్షణాలు అందరికీ ఒకేలా ఉండవు. కాబట్టి గుర్తించడం అంత తేలిక కాదు. ఎక్కువ మందికి బ్యాక్ పెయిన్ వస్తుంది. శరీరం చుట్టూ తాడు కట్టినట్లు ఫీలవుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. Breathing problem: కొంత మందికి ఊపిరి ఆడదు. జనరల్‌గా పరుగెడితే ఊపిరి ఆడదు. మెట్లు ఎక్కినప్పుడు అలసట వస్తుంది. ఇలా ఎందుకంటే... బాడీకి కావాల్సిన ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని గుండె సరిపడా సరఫరా చెయ్యలేనప్పుడు ఇలా అవుతుంది. రొమ్ము దగ్గర అసౌకర్యంగా ఉన్నప్పుడు ఊపిరి సరిగా అందకపోవడం కామన్ సమస్య. ఐతే.. ఇది సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణం కూడా అవ్వగలదు. అలాగే కళ్లు మసకబారతాయి. ఎదురుగా ఉన్నవి సరిగా కనిపించవు. జిడ్డుగా అవుతాయి. ఇలా అయినప్పుడు కళ్లుతిరిగి పడిపోయే ప్రమాదం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడాలంటే... తరచూ హార్ట్ హెల్త్ స్క్రీన్ (heart health screen) చేయించుకోవాలి. హైబీపీ (high blood pressure), కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేసుకుంటూ ఉండాలి. రోజూ కనీసం 3 కిలోమీటర్లు వేగంగా వాకింగ్ చెయ్యాలి. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తినాలి. (ప్రతీకాత్మక చిత్రం)