After Death: చనిపోయాక శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
After Death: చనిపోయాక శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
After Death: పుట్టుకలోనే చావు విత్తనం కూడా ఉంటుంది. ఎప్పుడు.. ఎవరు.. ఎలా చనిపోతారో తెలియదు. మరణం ఎప్పుడు ఏవైపు నుంచి తరుముకొస్తుందో తెలియదు..! అయితే చనిపోయాక శరీరంలో ఏం జరుగుదుందో మాత్రం తెలుసుకోవచ్చు
అందరూ చనిపోతారు. చనిపోని మనిషే ఉండడు. చనిపోయినప్పుడు శరీరం పనిచేయదు. మరణం తర్వాత అవయవాలు పనిచేయడం ఆగిపోతాయి. కణజాలాలు కుళ్లిపోతాయి. Image Source Shutterstock
2/ 8
మరణించిన తర్వాత మొదటిగా శరీరం పాలిపోతుంది. చనిపోయిన తర్వాత 15 నుంచి 25 నిమిషాలకు ఈ ప్రక్రియ మొదలవుతుంది. అంతేకాదు శరీరం రంగు కూడా మారుతుంది. Image Source Shutterstock
3/ 8
చనిపోయిన వాళ్లకు కొన్నిసార్లు అంగస్తంభన జరుగుతుంది. గురుత్వాకర్షణే దీనికి కారణం. మనలోని రక్తాన్ని గ్రావిటీ శరీర కింది భాగాలకు లాగుతుంది. దీని కారణంగా కొంతమంది పురుషుల్లో రక్తం ఫాలస్లో చేరి, అంగస్తంభన జరుగుతుంది. Image Source Shutterstock
4/ 8
సాధారణంగా..మనిషి శరీరం దాదాపు 37 డిగ్రీల సెల్సియస్ అంటే 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్ వద్ద ఉంటుంది. అయితే గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు డెడ్‌బాడీ చల్లపడుతుంది. Image Source Shutterstock
5/ 8
చనిపోయిన 3 గంటల తర్వాత శరీరంలో కండరాలు బిగిసుకుపోవడం మొదలుపెడతాయి. 12 గంటల తర్వాత అవి పూర్తిగా బిగిసుకుపోతాయి. Image Source Shutterstock
6/ 8
మరణంచిన కొన్ని గంటల తర్వాత శరీరంపై చిన్న చిన్న బొబ్బలు ఏర్పడతాయి. Image Source Shutterstock
7/ 8
చనిపోయిన తర్వాత మన శరీరంలోకి కొన్ని రకాల కెమికల్స్, చెడు వాసనను వదులుతాయి. దీని కారణంగా చనిపోయిన వాళ్ల శరీరం ఉబ్బుగా అవుతుంది. Image Source Shutterstock
8/ 8
బ్యాక్టీరియాలకు అడ్డా అయిన మన శరీరం.. చనిపోయిన తర్వాత కూడా వదిలిపెట్టవు. బతికున్నప్పుడు మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఉపయోగపడే ఈ బ్యాక్టీరియా చనిపోయాక శరీర భాగాలను తింటాయి. Image Source Shutterstock