వాలెంటైన్స్ డేను సెయింట్ వాలెంటైన్స్ డే అని కూడా పిలుస్తారు. దీన్ని ప్రతి ఏడాది ఫిబ్రవరి 14న నిర్వహిస్తారు. ఈరోజును ప్రేమకు గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటారు. అయితే, రానురాను ఇది వారమంతా వివిధ రోజులపాటు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 7 రోజ్ డే నుంచి ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే వరకు వారం మొత్తం వివిధ ప్రత్యేక రోజులుగా నిర్వహించుకుంటున్నారు.
వాలెంటైన్ వీక్ ఎలా సెలబ్రేట్ చేయాలి?
డిన్నర్ డేట్..
ఈ వారంలో ఒకరోజు మీ భాగస్వామితో డిన్నర్ ప్లాన్ చేయండి. అంటే ఇది వరకు మీరు వెళ్లిన ప్రదేశమైతే, చాలా బాగుంటుంది. దీనికి మీ తాహతకు సరిపోయే విధంగా.. 5 స్టార్ హోటల్ ఎక్కడైనా ప్లాన్ చేయండి.
మూవీ..
ఈ విపత్కర పరిస్థితుల్లో బయట సినిమాలకు వెళ్లలేకపోతే.. ఇంట్లోనే సినిమా సెటప్ ను దించేయండి. మీ భాగస్వామికి ఇష్టమైన సినిమాను చూసేయండి.
జాజ్..
ఈ వారంలో ఒకరోజు ఇద్దరూ కలిసి వండటానికి ప్రయత్నించండి. మీకు ఇష్టమైన ఓ ఇద్దరు ఫ్రెండ్స్ ను పిలవండి. సెల్ఫీలు తీసుకుని ఎంజాయ్ చేయండి.
ఈ ముఖ్యమైన రోజులో మీరు ఏదైనా రోజును సెలబ్రేట్ చేయాలని ఎంచుకుంటే వర్క్ పక్కన పెట్టండి. గొడవలు, మీకు ఇష్టం లేని విషయాలను తీసి పక్కన పెట్టండి.