యాలకుల్లో చాలా రకాలున్నాయి. అవి అన్నీ జింగీబెరాసెయ్ జాతి మొక్కల నుంచీ లభిస్తాయి. యాలకులు... ఇండియాతోపాటూ... భూటాన్, నేపాల్, ఇండొనేసియాలో కూడా లభిస్తాయి. సుగంధ ద్రవ్యాల్లో రాణిగా చెప్పుకున్నే యాలకులు... ప్రపంచంలో ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో మూడోవి. కుంకుమపువ్వు, వెనీలా మాత్రమే యాలకుల కంటే ఖరీదైనవి.
పడక సుఖానికి మేలు : సంతాన సాఫల్యతను పెంచడంలో యాలకులు బాగా ఉపయోగపడుతున్నాయి. వీటిలోని సినియోల్ అనే కాంపౌండ్... పురుషుల్లో నరాల పటిష్టతకు ఉపయోగపడుతోంది. రోజూ చిటికెడు యాలకుల పొడి వాడినా చాలు... సంతాన భాగ్యం కలుగుతుంది. నరాల బలహీనత ఉన్నవారు, లైంగిక సామర్ధ్యం లేనివారూ... రోజూ యాలకులు వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఆస్తమాకి విరుగుడు : కఫం, దగ్గు, ఊపిరాడకపోవడం, రొమ్ము దగ్గర ఏదో పట్టేసినట్లు ఉండటం వంటి సమస్యలతో బాధపడేవారు యాలకుల్ని రెగ్యులర్గా వాడాలి. ఇవి రక్త ప్రసరణను తేలిక చేసి... ఊపిరితిత్తులకు మేలు చేస్తాయి. కఫాన్ని కూడా తగ్గిస్తాయి. గ్రీన్ యాలకుల్ని ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యల్ని నయం చేయడానికి వాడతారు.