మన దేశంలో మనం జనరల్‌గా ఉదయం టిఫిన్ చేస్తాం. మధ్యాహ్నం, రాత్రీ భోజనం చేస్తాం. భోజనంగా ఎక్కువగా, వరి, గోధుమలు తీసుకుంటాం. వీటి బదులు మిల్లెట్స్‌గా పిలుస్తున్న రాగులు, సజ్జలు, గంట్లు, జొన్నలు తినాలని ఆరోగ్య నిపుణులు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా చాలా మంది సూచిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సైతం 2023 సంవత్సరాన్ని మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించింది. ఇంతమంది చెబుతున్నారంటే.. మిల్లెట్స్‌లో సంథింగ్ ఉన్నట్లే కదా. తెలుసుకుందాం.
మిల్లెట్స్ అనేవి.. నీరు తక్కువగా ఉన్నప్పటికీ సాగు చేసే వీలున్న పంటలు. మిల్లెట్స్‌లో 20 రకాలకు పైగా ఉన్నాయి. ఈ పంటల సాగుకి అయ్యే ఖర్చు కూడా తక్కువే. ఐతే... వీటిని చాలా వరకు మనుషులు తినడం మానేయడంతో.. ఆవులు, గేదెలు, పావురాలు వంటి వాటికి ఆహారంగా వేస్తున్నారు. ఈమధ్య కొంతమంది డాక్టర్లు... బీపీ, షుగర్ ఉండే వారిని మిల్లెట్స్ తినమని సూచిస్తూ వచ్చారు. దాంతో వీటికి డిమాండ్ పెరిగింది.
ఈ మిల్లెట్స్‌కి డిమాండ్ ఎంతలా పెరిగిందంటే... వీటిని సామాన్యులు తినే పరిస్థితి లేదు. వీటిలో కొన్ని కేజీ రూ.250 దాకా ఉండేవి కూడా ఉన్నాయి. అంతంత రేటు పెట్టి సామాన్యులు ఎలా కొనగలరు? ప్రభుత్వాలు మాత్రం.. మిల్లెట్స్ తినండి అని గొప్పగా చెబుతున్నాయి. ఇలా చెప్పే ముందు వాటి దిగుబడిని పెంచి.. ధరలు దిగివచ్చేలా చేస్తే సరైన చర్య అవుతుందని కొందరు అంటున్నారు.
Obesity : ఈ రోజుల్లో అధిక బరువు సమస్య చాలా మందికి ఉంటోంది. మిల్లెట్స్ తినేవారు బరువు తగ్గుతారని పరిశోధనలు తేల్చాయి. ఐతే.. మిల్లెట్స్ చప్పగా ఉంటున్నాయి కదా అని పంచదార కలుపుకొని తింటే మాత్రం విపరీతంగా బరువు పెరుగుతారు. కాబట్టి.. వాటిని వాటిలాగానే తినాలి. అప్పుడే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.
Alzheimer’s : మతిమరపు రాకుండా చేయడంలో మిల్లెట్స్ కొంతవరకూ ప్రయోజనం కలిగిస్తున్నాయి. అలాగే క్యాన్సర్ కణాల పెరుగుదలను ఇవి అడ్డుకోగలుగుతున్నాయి. గాయాలు బాగా తగ్గిస్తున్నాయి. ఎముకలు బలంగా ఉండేలా చేస్తున్నాయి. ఇలాంటి మంచి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి.. మిల్లెట్స్ తినడం అలవాటు చేసుకోమని నిపుణులు చెబుతున్నారు.
Diabetes : అన్నం, గోధుమలు తినేవారికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే మిల్లెట్స్ తినేవారికి ఈ అవకాశాలు తక్కువగా ఉంటాయనీ ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని 2021లో జరిపిన అధ్యయనం తేల్చింది. ఆల్రెడీ షుగర్ ఉన్నవారికి సైతం.. బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్‌ని మిల్లెట్స్ బాగా సరిచేయగలవని నిపుణులు చెబుతున్నారు.