కార్టూన్ ఆర్ట్స్‌లో మబ్బులు ఎలాగైతే ఉంటాయో... అలాంటి రూపురేఖలతోనే ఉండటంతో ఈ పండ్లకు క్లౌడ్ బెర్రీస్ అనే పేరు వచ్చింది. ఎంతో రుచికరమైన ఈ చిన్ని పండ్లలో ఎన్నో పోషకాలున్నాయి. మొదట్లో తెల్లగా ఉండే ఈ పండ్లు... క్రమంగా ఆరెంజ్, ఎరుపు రంగులోకి మారతాయి. చివరిగా పసుపు, అంబెర్ రంగులోకి మారినప్పుడు మంచి టేస్ట్ ఉంటాయి. ప్రస్తుతం ఈ పండ్లను చాలా ఫ్రూట్ కంపెనీలు సాగుచేస్తున్నాయి. ఐతే... ఇవి ఎక్కువగా మంచు అడవుల్లోనే పెరుగుతాయి. (credit - twitter - Maria Stone)
ఎర్రగా ఉండే పండ్లు కాస్త పుల్లగా ఉంటాయి. అదే పసుపు రంగులోకి మారినప్పుడు మాత్రం తియ్యగా ఉంటాయి. అందుకే వీటిని కేక్స్, జామ్స్‌లో ఎక్కువగా వాడుతున్నారు. వీటిలో జ్యూ్స్ ఎక్కువే. స్ట్రాబెర్రీస్, బాయ్ సెన్ బెర్రీస్ (boysenberries) తర్వాత ఎక్కువ జ్యూస్ ఉండే బెర్రీస్ ఇవే. ఈ పండ్లు తాజాగా దొరికే సందర్భాలు తక్కువ. ఎందుకంటే ఇవి మొక్కల నుంచీ కోసిన కొన్ని గంటలకే పాడైపోతాయి. కంటిన్యూగా ఫ్రిజ్‌లో ఉంచాల్సిందే. అన్ని సందర్భాల్లో అది సాధ్యం కావట్లేదు. ఈ పండ్లను అవెరిన్, బేక్ యాపిల్, నాట్ బెర్రీ, నౌట్ బెర్రీ, నార్డిక్ బెర్రీ, యెల్లో బెర్రీ అని కూడా పిలుస్తున్నారు. (credit - twitter - thisisFINLAND)
100 గ్రాముల క్లౌడ్ బెర్రీస్‌లో 51 కేలరీల శక్తి ఉంటుంది. కార్బొహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ C, విటమిన్ K1, విటమిన్ E, విటమిన్ A, నియాసిన్, ఫోలేట్, రైబోఫ్లావిన్, పైరోడోక్సిన్, థయామిన్, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్, ఫాస్పరస్, కాపర్, కాల్షియం, సెలెనియం, సోడియం... ఇంకా చాలా పోషకాలు వీటిలో ఉన్నాయి. అందుకే ఈ పండ్లకు మంచి డిమాండ్ ఉంది. (credit - twitter - Епанчинцева Татьяна)
ఇంతకీ ఈ పండ్ల రేటెంతో చెప్పలేదు కదూ. అమెరికా లాంటి దేశాల్లో పావుకేజీ రూ.500 దాకా ఉంటోంది. ఆన్లైన్ ఈ-కామర్స్ సైట్లలో 250 గ్రాములు రూ.850 దాకా ఉంటోంది. చాలా సైట్లు పండ్లను కాకుండా... వాటితో తయారుచేసిన జామ్స్ మాత్రమే అమ్ముతున్నాయి. ఎక్కువ పోషకాలు ఉండటంతో... నార్త్ దేశాల్లో ఈ పండ్ల జామ్స్‌ను బాగానే కొనుక్కుంటున్నారు. (credit - twitter - Епанчинцева Татьяна)