Diabetics Health Tips : మీరు రోజూ రాత్రి వేళ ఏ టైమ్‌కి భోజనం చేస్తున్నారు? భోజనం తర్వాత ఎంత సేపటికి మీరు నిద్రపోతున్నారు? ఈ రెండు అంశాలూ అత్యంత కీలకమైనవని మీకు తెలుసా? రాత్రి భోజనానికీ, నిద్రకూ, ఆరోగ్యానికీ లింక్ ఉంది. అది మనం తప్పక తెలుసుకోవాలి. తద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మీకు తెలుసా... బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్... సాయంత్రం ఐదు గంటలకే డిన్నర్ చేసేస్తాడు. ఎందుకంటే అతనికి ఈ ఆరోగ్య రహస్యం తెలుసు. ఈ రోజుల్లో నైట్ పార్టీలూ, ఇతర వర్కులతో... రాత్రివేళ భోజనాన్ని లైట్ తీసుకుంటున్నారు. ఏదో ఒకటి తినేయడం, ఎక్కువా, తక్కువా తినడం, టైముకి తినకపోవడం, ఆలస్యంగా తినడం, నిద్రపోయే ముందు తినడం ఇలాంటి ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు. కానీ ఈ పరిస్థితికి మనం చెక్ పెట్టుకోవాలి. చక్కగా టైమ్ ప్రకారం తినాలి. బాగా తినాలి. మంచిగా నిద్రపోవాలి. అలా ఎందుకో ఓసారి తెలుసుకుందాం.
1. ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది : మన బాడీలోని బ్లడ్‌లో చక్కెర నిల్వలు పెరిగితే... ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. బట్... ఇన్సులిన్ ఉత్పత్తి మనకు అత్యవసరం. అది ఆగిపోయినా, తగ్గిపోయినా, టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి పద్ధతి ప్రకారం జరగాలంటే... రాత్రివేళ త్వరగా భోజనం చెయ్యాలి.
2.నిద్ర బాగా పడుతుంది : రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే... ఏసీడీటీ, గ్యాస్, అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. త్వరగా తినాలి, తక్కువ తినాలి, మంచి ఆహారం తినాలి... ఇలా చేస్తే... ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది, నిద్రబాగా పడుతుంది. ఎందుకంటే... రాత్రివేళ జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది. లేటుగా తింటే... ఆ ఆహారం పొట్టలో అలాగే ఉంటుంది. అది షుగర్ లెవెల్స్ పెరగడానికి దారితీస్తుంది. అందువల్ల త్వరగా తినేస్తే... పడుకునే సమయానికి ఆహారం దాదాపు జీర్ణం అవుతుంది. అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
3.శరీర వేడి తగ్గిస్తుంది : శరీరంలో అధిక వేడి అనేక అనారోగ్యాలకు కారణం అవుతుంది. వేడిని కంట్రోల్లో ఉంచుకునేందుకు మనం ప్రయత్నించాలి. రాత్రివేళ త్వరగా తినేస్తే వేడి అదుపులో ఉంటుంది.
4.చక్కటి జీర్ణక్రియ... పొట్టకు మేలు : డిన్నర్ త్వరగా చేస్తే... జీర్ణక్రియ వేగంగా సాగుతుంది. టైమ్ ప్రకారం తినాలి, టైమ్ ప్రకారం పడుకోవాలి, అలాగే టైమ్ ప్రకారం లేవాలి కూడా. ఇలా చేస్తే... మన బాడీ... ఈ భూమిపై ఉన్న వాతావరణంతో కనెక్ట్ అయ్యి... బాడీలో బయోక్లాక్ (దీన్నే జీవ సంబంధింత క్లాక్ అంటారు) పద్ధతిగా పనిచేస్తుంది. శరీర వ్యవస్థలన్నీ ఈ క్లాక్‌కి తగ్గట్టు పనిచేస్తాయి. అందువల్ల జీర్ణక్రియ పద్ధతిగా జరుగుతుంది. నిద్రకూ, పడుకోవడానికీ మధ్య రెండు గంటలైనా గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.
5. కొవ్వుకు చెక్ : మనం చూస్తుంటాం... చాలా మంది అధిక బరువు, అధిక కొవ్వుతో బాధపడుతుంటారు. వాళ్ల సమస్యలకు ఎన్నో కారణాలు ఉండి ఉండొచ్చు. త్వరగా డిన్నర్ చేసేవాళ్లకు బాడీలో ఫ్యాట్ నిల్వలు పేరుకోవు. ఆల్రెడీ అలాంటి నిల్వలు ఉంటే కూడా అవి కరిగిపోతాయి. ఫలితంగా అధిక బరువు సమస్య నుంచీ తప్పించుకోవచ్చు. బరువు తగ్గించుకోవాలని ప్రయత్నించేవారు... తప్పనిసరిగా త్వరగా డిన్నర్ చెయ్యాలి. కనీసం 7 గంటలు పడుకోవాలి. మార్నింగ్ 5 కల్లా లేచి... ఓ గంటైనా ఎక్సర్సైజ్, వర్కవుట్స్ వంటివి చేస్తే... ఆరోగ్యమే ఆరోగ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.