Weight Loss : బరువు తగ్గాలా.. అయితే ఈ బ్లాక్ ఫుడ్స్ మీ డైట్ లో వెంటనే చేర్చుకోండి..
Weight Loss : బరువు తగ్గాలా.. అయితే ఈ బ్లాక్ ఫుడ్స్ మీ డైట్ లో వెంటనే చేర్చుకోండి..
Weight Loss : అధిక బరువు అనేక వ్యాధులకు కారణమవుతుంది. అందువల్ల బరువు తగ్గడం మరియు బరువు నియంత్రణ. దీనిపైనే అందరి దృష్టి ఉంది. మీరు మీ డైట్లో కొన్ని డార్క్ ఫుడ్స్‌ని చేర్చుకుంటే ఇది సాధ్యమవుతుంది.
ముఖ్యంగా కరోనా తర్వాత మనలో చాలా మంది ఆరోగ్యంపై అవగాహన పెంచుకున్నారు. ఒక వ్యక్తి ఆరోగ్యకరమైన, దృఢమైన శరీరం కోసం వారి ఆహారంలో ప్రోటీన్, పోషకాలు మరియు పీచుపదార్థాల్ని చేర్చుకుంటున్నారు.
2/ 9
అయితే, చాలా మందిని వేధించే సమస్య అధిక బరువు. దీంతో.. వెయిట్ లాస్ కోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఈ బ్లాక్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్లో చేర్చుకుంటే మీరు ఈజీగా బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి.
3/ 9
షియా గింజలు: వీటిలో ఖనిజాలు, ఫైబర్ మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మీ బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. పిండి పదార్థాలు, కొవ్వును తగ్గించడంలో షియా గింజలు గ్రేట్ గా సహాయపడుతాయి.
4/ 9
డార్క్ చాక్లెట్: జీర్ణక్రియను మెరుగుపరచడంలో, కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడే మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లను కలిగి ఉంటుంది. డార్క్ చాక్లెట్ తినడం ఆకలిని అణిచివేస్తుంది.. ఇది కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. కానీ డార్క్ చాక్లెట్ ను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.
5/ 9
నల్ల మిరియాలు: ఇందులో విటమిన్లు ఎ, సి, కె, మినరల్స్, హెల్తీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉన్నాయి. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మిరియాల్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల క్యాలరీలు కరిగిపోయి కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది.
6/ 9
బ్లాక్ రైస్: బ్లాక్ రైస్‌లో ఆంథోసైనిన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బ్లాక్ రైస్‌లో ఉండే ఫైబర్ బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా టైప్-2 డయాబెటిస్ రిస్క్‌ను తగ్గిస్తుంది.
7/ 9
బ్లాక్ టీ : పాలు మరియు పంచదారతో చేసిన సాధారణ టీ కంటే బ్లాక్ టీ తీసుకోవడం చాలా ప్రయోజనకరం. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ సెల్ డ్యామేజ్‌ని తగ్గిస్తుంది, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది మరియు ఊబకాయాన్ని తగ్గిస్తుంది.
8/ 9
బ్లాక్ వెల్లుల్లి: బ్లాక్ వెల్లుల్లిలో తెల్ల వెల్లుల్లి కంటే రెట్టింపు విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇది చెడు కొలెస్ట్రాల్ ,ఊబకాయాన్ని తగ్గిస్తుంది.
9/ 9
బ్లాక్‌బెర్రీ: ఇందులో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వివిధ రకాల పోషకాలు ఉన్నాయి. బ్లాక్ బెర్రీస్ తినడం వల్ల శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు. అందమైన చర్మంతో పాటు బరువు తగ్గడంలో బ్లాక్ బెర్రీస్ చాలా ఉపయోగపడతాయి.