మోస్ట్ పాపులర్ హాట్ డ్రింక్స్‌లో కాఫీ (Coffee) ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. దీనితో అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కాఫీ బరువు (Weight Loss) తగ్గించడంలోనూ సహకరిస్తుంది. కానీ ఈ విషయం తెలియక చాలామంది ఖరీదైన కొవ్వు కరిగించే ఫ్యాట్ బర్నింగ్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేస్తుంటారు. వాటికి బదులు వారు కాఫీ తాగినా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కాఫీలోని కెఫిన్ (Caffeine) అనేది సహజంగా లభించే మాలిక్యుల్. ఇది కొవ్వును కరిగించడంలో చాలా హెల్ప్ చేస్తుంది. మెటబాలిజాన్ని 3-11 శాతం మెరుగుపరుస్తుంది. మార్కెట్లోని చాలా ఫ్యాట్ బర్నర్లలో కెఫిన్ ప్రధాన పదార్థంగా ఉంటుంది. అంటే కాఫీ తీసుకున్నా వెయిట్ లాస్ బెనిఫిట్స్ చేకూరుతాయనే అర్థం చేసుకోవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు.
కాఫీతో బరువు తగ్గేదెలా : నిపుణుల ప్రకారం, కాఫీ అనేది కొవ్వు, చక్కెర లేదా కార్బోహైడ్రేట్ లేని కేలరీ-ఫ్రీ డ్రింక్. కాఫీ ఆకలిని తగ్గిస్తుంది. కేలరీల ఇన్‌టేక్‌ను కూడా తగ్గిస్తుంది. ఇందులో ఉండే కెఫిన్ విశ్రాంతి జీవక్రియ రేటు (Resting Metabolic Rate)ను పెంచుతుంది. దీని ఫలితంగా కాఫీ సేవించేవారు బరువు తగ్గడం జరుగుతుంది. వర్కౌట్స్ చేయడానికి ఒక గంట ముందు కాఫీ తీసుకోవడం ద్వారా మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు. కొవ్వును సమర్థవంతంగా కరిగించుకోవచ్చు. అదనంగా ఇది డోపమైన్ విడుదలను ప్రోత్సహించి కేలరీల ఖర్చును పెంచుతుంది. వెయిట్ లాస్ బెనిఫిట్స్ అందించడంతో పాటు కాఫీ జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, రియాక్షన్ టైమ్ పెంచుతుంది. కాఫీలో మాంగనీస్, పొటాషియం వంటి ఖనిజాలు, అలానే B2, B5, B3 విటమిన్లు లభిస్తాయి.
జాగ్రత్తలు : పాలు లేదా చక్కెర లేని కాఫీ తాగడం ద్వారానే బరువు తగ్గడం సాధ్యమవుతుందని నిపుణులు అంటున్నారు. రోజుకు 2 లేదా 3 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగడం వల్ల గుండె సమస్యలు వస్తాయని కూడా హెచ్చరిస్తున్నారు. అధిక రక్తపోటు ఉన్నవారు కాఫీ తాగకూడదని సూచిస్తున్నారు. గర్భవతులు కూడా కాఫీ అధికంగా తాగకూడదు. వారు డాక్టర్ చెప్పిన ప్రకారం కాఫీ తాగే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
నిపుణుల ప్రకారం, ఎవరైతే గర్భవతులు రోజుకు 200 మి.గ్రా కంటే తక్కువ కెఫిన్‌ను తీసుకున్నారో, అంటే అరకప్పు కాఫీకి సమానం, వారు ఎలాంటి కెఫిన్ తీసుకోని గర్భవతుల కంటే చిన్న సైజు పిల్లలకు జన్మనిచ్చారు. అంటే గర్భంతో ఉన్నవారు కెఫిన్‌ను తీసుకుంటే వారికి పుట్టే పిల్లల పరిమాణం తగ్గుతుందని దీనినిబట్టి తెలుస్తోంది.
ఇతర జాగ్రత్తలు : కాఫీ తాగే సమయంలో ఎఫెడ్రిన్, యాంటీ డయాబెటిక్ మందులు, థియోఫిలిన్, ఫెనోథియాజైన్స్, ట్రైసైక్లిక్ యాంటిడిప్రెసెంట్స్, ఆస్తమా, గర్భనిరోధక మందులు వాడకూడదు. డైలీ 400mg కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల కొంతమంది వ్యక్తులలో చికాకుగా అనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అంతకుమించి మోతాదులో కెఫిన్ తీసుకోకూడదు. ప్రతిస్కంధక (Anticoagulant) ఔషధాలను తీసుకున్నప్పుడు కూడా కెఫిన్ తీసుకోవడం మంచిది కాదు.