WEIGHT LOSS HERE IS THE SIMPLE TIPS FOR WEIGHT LOSS OBESITY BY USING HOME REMEDIES SK
Weight Loss: లావుగా కనిపిస్తున్నారా.. మిమ్మల్ని స్లిమ్‌గా మార్చే అద్భుతమైన వంటింటి చిట్కా
Weight Loss Tips: ప్రస్తుతం చాలా మందిలో అధిక బరువు సమస్య కనిపిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ఊబకాయంతో బాధపడుతున్నారు. వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడంతో.. చిన్న వయసులోనే పెద్ద పొట్టలేసుకొని తిరుగుతున్నారు. మరి ఈ సమస్యకు చెక్ పెట్టడం ఎలా?
వంటింట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే అధిక బరువు నుంచి బయటపడవచ్చు. కేవలం వాము, కరివేపాకుతో ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
వంటింట్లో ఉండే వాము అధిక బరువును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన అవసరం లేని కొవ్వును ఇట్టే కరిగిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
బరువు తగ్గించడంలో కరివేపాకు కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కరివేపాకు అందరి ఇళ్లల్లో సులభంగానే అందుబాటులో ఉంటుంది. దాదాపు ప్రతి రోజు మనం కూరల్లో వాడుతాం. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
కరివేపాకును ఎండబెట్టుకోవాలి. ఏ మాత్రం పచ్చిగా ఉండకూడదు. పూర్తిగా డ్రై అవ్వాలి. వామును సన్నని మంటపై వేయించుకోవాలి. ఈ రెండింటినీ మిక్సీలో వేసి మెత్తని పౌడర్ తయారు చేసుకోవాలి. ఒక టీ స్పూన్ వాముకు ఒక కరివేపాకు చొప్పున తీసుకొని ఈ పొడి చేసుకోవాలి. (images credit - wikipedia)
5/ 6
ఈ వాము, కరివేపాకు పొడిని గాజు సీసాలో దాదాపు నెల రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం గోరువచ్చని వేడి నీటిలో అర స్పూన్ పొడి వేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
నెల రోజుల పాటు ప్రతి రోజు తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. ఐతే ఈ పొడితో పాటు మంచి పోషకాహారం తీసుకోవాలి. యోగా లేదా వ్యాయామం చేయాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)