యాంటీ ఆక్సిడెంట్స్ : వాటర్ చెస్ట్నట్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్ ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతాయి. ఫలితంగా గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, అనేక రకాల క్యాన్సర్లు రాగలవు. వాటర్ చెస్ట్నట్లలో ప్రధానంగా ఫెరులిక్ యాసిడ్, గాలోకాటెచిన్ గాలెట్, ఎపికాటెచిన్ గాలెట్, కాటెచిన్ గాలెట్ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో విష వ్యర్థాల్ని తరిమేస్తాయి.