చికెన్, పోర్క్, ఫిష్ వంటి కొన్ని రకాల మాంసాలు కూడా బరువు తగ్గడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని ప్రచారంలో ఉంది. మాంసంలో ఉండే అధిక ప్రోటీన్ కంటెంట్ మనిషి ఫిట్‌గా ఉండటానికి సహాయపడుతుంది. అయితే, వివిధ జంతువుల మాంసాలు వేర్వేరు లక్షణాలు ఉంటాయి. కాబట్టి ప్రతి మాంసం బరువు తగ్గడానికి ఉపయోగపడకపోవచ్చు. అదనపు బరువును తగ్గించుకోవడం కోసం ఆహారంలో చేర్చుకోవడానికి పరిగణించాల్సిన కొన్ని రకాల మాంసాలను ఇప్పుడు పరిశీలిద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
సాల్మన్ చేపలు (Salmon) : సాల్మన్ చేపల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇతర ఆహారాలతో పోలిస్తే ఇందులో అత్యధికంగా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సాల్మన్ చేపలను తీసుకోవడం వల్ల మీరు ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉందన్న అనుభూతి చెందుతారు. వీటిని తరచుగా తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా, జీవక్రియ మెరుగవుతుంది. పొట్ట కొవ్వును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
స్కిన్లెస్ చికెన్ : సాధారణంగా మాంసాల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నప్పటికీ, స్కిన్లెస్ చికెన్ బ్రెస్ట్ తినడం వల్ల బరువు తగ్గడంలో కీలకంగా ఉండే లీన్ ప్రొటీన్ శరీరానికి అందుతుంది. అంతేకాకుండా శరీర ఆరోగ్యాన్ని కాపాడే విటమిన్లు, ఖనిజాలు కూడా అందులో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి చికెన్ తినే ముందు, దాని చర్మాన్ని తీసివేయండి. అలాగే లెగ్ పీస్ చికెన్‌లో కనిపించే ముదురు మాంసాన్ని కూడా తీసుకోవద్దు. (ప్రతీకాత్మక చిత్రం)
పోర్క్ : సమర్థవంతంగా బరువు తగ్గడంలో పంది మాంసం కీలక పాత్ర పోషిస్తుంది. వీటిలో ప్రధానంగా పోర్క్ టెండర్లాయిన్, పోర్క్ చాప్స్ తీసుకోవాలి. ఎందుకంటే వాటిలో తక్కువ కేలరీలు ఉంటాయి. అయితే ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. పంది మాంసం వండేటప్పుడు కనిపించే కొవ్వును తీసివేయండి. దీంతో అది త్వరగా ఉడుకుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రాసెస్ చేసిన మాంసం : చికెన్ నగ్గెట్స్, సాసేజ్స్, సలామీ, బేకన్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలు ప్రస్తుతం విరివిగా లభిస్తున్నాయి. వీటిల్లో ఎక్కువ కేలరీలు ఉంటాయి. అలాగే సంతృప్త కొవ్వుల శాతం కూడా అధికంగా ఉంటుంది. వీటిని ప్రాసెస్ చేయడం వల్ల సోడియం అధికంగా ఉంటుంది. దీంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఫ్రై చేసిన మాంసాలు : నగ్గెట్‌లను తయారు చేయడానికి చికెన్‌ను బ్రెడ్ ముక్కలతో పూత పూస్తారు. దీంతో ఈ మాంసంలో కొవ్వు, క్యాలరీలు పెరుగుతాయి. మీరు బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు వీటికి దూరంగా ఉంటే బెటర్. అలాగే పోర్క్ బెల్లీ, బేకన్ వంటి మాంసంతో చేసిన పదార్థాల్లో కూడా అదనపు కొవ్వు ఉంటుంది. వీటిని గనుక తీసుకుంటే మీరు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)