బరువు పెరిగినంత సులువుగా తగ్గడం అంత ఈజీ కాదు. ఇది కొందరికే సాధ్యమవుతుంది. బరువు తగ్గడం కోసం సాధారణంగా జనాలు జిమ్‌లో తీవ్రమైన వర్కౌట్స్ చేస్తుంటారు. అలాగే ఆహారాన్ని కూడా పరిమితంగా తీసుకుని బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇక్కడ కీలకమైన ఓ విషయంపై శ్రద్ధ చూపరు. అదే జీవక్రియ( మెటబాలిజం). (ప్రతీకాత్మక చిత్రం)
జీవక్రియ, బరువు మధ్య సంబంధం
జీవక్రియ, బరువు మధ్య అనులోమ సంబంధం ఉంది. మన శరీర కేలరీలను బర్న్ చేసే వివిధ మార్గాలలో బేసల్ మెటబాలిక్ రేటు ఒకటి. ఇది శరీరం విశ్రాంతి తీసుకునే సమయంలో అవసరమైన శక్తిని అందిస్తుంది. అధిక జీవక్రియ రేటు ఉంటే, వారి శరీరం ఎక్కువ కేలరీలు బర్న్ చేయగలుగుతుంది. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది. మీకు తక్కువ జీవక్రియ ఉంటే, తగినంత కేలరీలను బర్న్ చేయలేరు. (ప్రతీకాత్మక చిత్రం)
వేసవిలో రోజు ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా, ఇది శీతాకాలంలో కంటే రోజంతా మరింత చురుకుగా ఉండేలా చేస్తుంది. శీతాకాలంలో సోమరితనం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ వేసవికాలంలో మాత్రం భిన్నం. రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. శీతాకాలం అంటే విపరీతమైన చలిలో, నిబంధనల ప్రకారం ఎవరూ వ్యాయామం చేయలేరు. అలాగే ఈ సమయంలో తినడం, తాగడం ఎక్కువ. ఫలితంగా చలికాలంలో త్వరగా బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. దాదాపు అన్ని సందర్భాల్లో మార్చి నెల తర్వాత 3-4 కిలోల బరువు తగ్గినట్లు కనిపిస్తోంది.
శరీరం ఇంజిన్ సగటున ఎంత వేగంగా నడుస్తుంది అనే దానిపైనే, ఎన్ని కేలరీలు బర్న్ అవ్వడం ఆధారపడి ఉంటుంది. కొందరు ఇతరుల కంటే ఎక్కువగా తిన్న బరువు పెరగరు. అందుకు కారణం వారిలో జీవక్రియ రేట్ అధికంగా ఉండడమే. జీవక్రియ రేట్ నెమ్మదిగా ఉన్నవారు విశ్రాంతి సమయంలో లేదా పని సమయాల్లో కూడా తక్కువ కేలరీలను బర్న్ చేస్తారు. దీంతో వీరు అధిక బరువు పెరగకుండా ఉండాలంటే తక్కువ తినాలని హార్వర్డ్ మెడికల్ స్కూల్ నివేదిక తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఎండోమార్ఫ్స్ శరీర రకంవారు బరువు తగ్గాలంటే కార్బోహైడ్రేట్లను పరిమితంగా తీసుకోవాలి. ఉదాహరణకు వైట్ బ్రెడ్, వైట్ రైస్, పాస్తా, కేకులు, పేస్ట్రీలు, కుకీస్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. వీరు జిమ్‌లో ఫిట్నెస్ ట్రైనర్ సూచించిన వ్యాయామాలతో పాటు కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వాటిని సాధన చేస్తూ ఉండాలి.
ఎక్టోమార్ఫ్స్ (Ectomorphs) ఈ రకం శరీరం ఉన్నవారికి అధిక జీవక్రియ రేటు ఉంటుంది. దీంతో వారి బాడీ స్లిమ్‌గా ఉంటుంది. శరీర నిర్మాణానికి సంబంధించి చిన్న ఎముక నిర్మాణం, చిన్న భుజాలు, సన్నని కండర ద్రవ్యరాశి, ఫ్లాట్ ఛాతీ ఉంటుంది. బరువు పెరగడం కోసం కార్బోహైడ్రేట్లను తీసుకోవాలని డైటీషియన్స్ సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా టర్కీ, చికెన్, లీన్ స్టీక్, గుడ్లు, ప్రోటీన్ షేక్‌లు, చేపలు వంటి ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి.