అంటే శరీరంలో పేరుకుపోయిన క్యాలరీలు కరిగేందుకు ఎక్కువ సమయం పడుతుంది. దీని ఫలితాలు కనిపించడానికి చాలా రోజులు వేచి చూడాల్సిందే. అయితే అసలు వ్యాయామం చేయకుండానే జీవనశైలిలో కొన్ని చిన్న మార్పులు చేసి (Weight loss tips in telugu) మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. వెయిట్ మేనేజ్మెంట్ కోసం ఆహారం, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలంటున్నారు నిపుణులు.(ప్రతీకాత్మక చిత్రం)
మన శరీరం ప్రధానంగా కాలేయం, కిడ్నీలలో పేరుకుపోయే కొవ్వును బర్న్ చేస్తుంది. ఈ రెండు అవయవాలు ‘ఫైట్ ఆర్ ఫ్లైట్’ మోడ్‌లో పనిచేస్తాయి. మనం తీసుకునే ఆహారం తక్కువగా ఉండి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉంటే.. కార్బోహైడ్రేట్ల నుంచి వచ్చే గ్లూకోజ్ (Glucose)కు బదులుగా ఇప్పటికే నిల్వ ఉన్న కొవ్వును మన శరీరం ఎనర్జీ కోసం బర్న్ చేస్తుంది. ఈ కొవ్వు కరిగి ఫ్యాటీ యాసిడ్‌గా మారుతుంది. దాని నుంచి శరీరం శక్తిని పొందుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)