WANT TO LOOSE WEIGHT EASILY WHILE EATING YOUR FAVORITE FOOD THEN FOLLOW THIS TIPS TO CONTROL YOUR HEAVY WEIGHT PRV
Weight loss tips: ఇష్టమైన ఫుడ్ తింటూనే బరువు తగ్గాలని ఉందా? అయితే మీ ఆహారంలో వీటిని తినండి చాలు..
చాలామంది బరువు తగ్గడానికి (weight loss) చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. డాక్టర్లు చెప్పిన పద్దతులు, జిమ్ ట్రైన్లరు చెప్పినవీ చేస్తుంటారు. కానీ, కేవలం చిరుధాన్యాలు మీ బరువును కంట్రోల్ చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయట.
ప్రతీ ఒక్కరికి బరువు (weight) అనేది ప్రమాదకరమే. దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే డాక్టర్లు బరువు తగ్గడానికి వ్యాయామాలు చేయడం మంచిదని సలహాలు (weight loss tips) ఇస్తుంటారు.
2/ 7
అయితే దానికోసం రకరకాల ఎక్సర్సైజ్లు చేయడం మొదలు పెడతారు. ఒకటి రెండు రోజులు చేయగానే బద్దకంతోనో, పని ఒత్తిడితోనో మధ్యలోనే మానేస్తుంటారు. చాలామంది బరువు తగ్గడానికి (weight loss) చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.
3/ 7
డాక్టర్లు చెప్పిన పద్దతులు, జిమ్ ట్రైన్లరు చెప్పినవీ చేస్తుంటారు. కానీ, కేవలం చిరుధాన్యాలు (Cereals) మీ బరువును కంట్రోల్ చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయట. దాని గురించి (weight loss tips) ఒకసారి తెలుసుకుందాం..
4/ 7
రాగులలో (Rags) ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. హీమోగ్లోబిన్ తయారీకి అవసరమైన ఐరన్ రాగుల ద్వారా శరీరానికి అందుతుంది. అంతేకాకుండా వీటిలో కాల్షియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
5/ 7
ఫలితంగా ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. డయాబెటిస్తో బాధపడేవారికి ఇది మంచి ఆహారం. రాగులు పిల్లలకు పెడితే చాలా మంచిది. ఇందులో ఉన్న అమైనోయాసిడ్స్ పిల్లల మెదడు పెరుగుదలకు సహాయపడతాయి.
6/ 7
జొన్నల్లో విటమిన్ బి, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లావనాయిడ్లు, ఫెనొలిక్ యాసిడ్స్, టానిన్స్ ఉంటాయి. బి విటమిన్ జీవక్రియల రేటును పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
7/ 7
మెగ్నీషియం ఎముకలు, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. 96గ్రాముల జొన్నలు తీసుకుంటే రోజూ తీసుకోవాల్సిన ఫైబర్లో 20 శాతం శరీరానికి అందుతుంది. ఫైబర్ పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.